దేశ రాజధాని ఢిల్లీ ఇక ఇప్పుడు దారుణమైన నేరాలకు చిరునామాగా మారిపోయింది అని చెప్పాలి. గత కొంతకాలం నుంచి అక్కడ వెలుగులోకి వస్తున్న ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోతున్నాయ్. ప్రతి ఒక్కరిని కూడా వనికి పోయేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. శ్రద్ధ వాకర్ ను ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేసి 35 ముక్కలుగా చేసిన ఘటన మరువకముందే ఇటీవల నిక్కి యాదవ్ అనే యువతి నీ కూడా దారుణంగా హత్య చేసి ఇక శవాన్ని ఫ్రిజ్లో దాచిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఇటీవలే మరో దారుణ హత్యకు సంబంధించిన ఘటన వెలుగులోకి రావడమే కాదు ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోవడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. చిన్నపాటి గొడవకే కొందరు వ్యక్తులు విచక్షణ కోల్పోయి ఓ యువకుడిని నడిరోడ్డు పైనే దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఢిల్లీలోని నంగులు ఏరియాకు చెందిన విశాల్ మాలిక్ అనే యువకుడు ఉదయం సమయంలో జిమ్కు వెళ్లి తిరిగి వస్తుండగా దారి వెంట నడుచుకుంటూ వెళుతున్న ఒక వ్యక్తికి పొరపాటున బైక్ తగిలింది. దీంతో స్థానికంగా ఉన్న పదిమంది వ్యక్తులు అతనిపై దాడికి దిగారు. అయితే వారి నుంచి తప్పించుకున్న విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారు పట్టించుకోలేదు.


 ఈ క్రమంలోనే తనపై దాడి జరిగిన విషయాన్ని తన అన్న సాహిల్ మాలికకు చెప్పాడు విశాల్. అయితే కోపంతో ఊగిపోయిన సాహిల్ ఇక అక్కడే తమ్ముడు వదిలేసిన బైక్ తెచ్చేందుకు వెళ్లాడు. అయితే ఇలా వెళ్లిన సాహిల్ పై కూడా అక్కడున్న వ్యక్తులు దాడికి దిగారు. అంతటితో ఆగకుండా కత్తితో కడుపులో పొడిచి దారుణంగా హత్య చేశారు. అయితే చుట్టుపక్కల వాళ్ళు అతని కాపాడి ఇక ఆసుపత్రికి తరలించిన మార్గమధ్యమంలోనే విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే బాధిత యువకుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజికి సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: