యువతి, యువకుల మధ్య ప్రేమ పుట్టడం సర్వసాధారణమైన విషయమే. అయితే ఇలా ప్రేమలో పడినవారు కొంతమంది ఏకంగా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటూ ఉంటే.. మరి కొంతమంది మాత్రం ఇక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. అయితే ప్రేమలో ఉన్నప్పుడు సినిమాలు షికార్లు అంటూ ఇక ప్రేమికులు ఎంజాయ్ చేయడం చేస్తూనే ఉంటారు. ఇది ఏ లవ్ స్టోరీ లో అయినా సరే సర్వసాధారణం. కానీ ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే లవ్ స్టోరీ మాత్రం ఇప్పటివరకు కనీ విని ఎరుగనిది అని చెప్పాలి. సినిమాల్లో కూడా ఇంత క్రియేటివ్ లవ్ స్టోరీ ఉండదేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రియుడుతో సినిమాలు షికార్లు అంటూ  ఎంజాయ్ చేసిన ప్రియురాలు చివరికి అతనికి షాక్ ఇచ్చి ప్రియుడి తండ్రి తో లేచిపోయింది.


 ప్రియుడు తండ్రితో లేచిపోవడమేంటి.. ఆమె ప్రేమించింది యువకుడిని కదా అనుకుంటున్నారు కదా.. ఆ ప్రియుడికి కూడా ఇలాంటి అనుమానమే కలిగింది. కాన్పూర్ లో ఈ ఘటన వెలుగు చూసింది. కమలేష్ అనే వ్యక్తి కి 21 ఏళ్ళ అమిత్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే అమిత్ ఖాన్పూర్ లో ఉంటున్న ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. యువతి కూడా అమిత్ ను ఎంతో గాఢంగా ప్రేమించింది.. రెండేళ్ల పాటు సినిమాలు షికార్లు అంటూ ప్రేమలో మునిగి తేలింది ఈ జంట. వీరి ప్రేమ వ్యవహారం ఇద్దరి కుటుంబాల్లో తెలిసింది.


 అయితే రెండు కుటుంబాలు పెళ్లికి వ్యతిరేకించకపోయిన చిన్న వయసులో పెళ్లి ఎందుకు కొన్నాళ్లు ఆగుదాం అంటూ నిర్ణయించుకున్నారు. ఇదే విషయం యువతి తల్లిదండ్రులు అమిత్ తండ్రి కమలేష్ కు చెప్పారు. అయితే ఓ రోజు అమిత్ తన ప్రియురాలని ఇంటికి పిలిపించుకున్నాడు. అయితే ఇలా ఇంటికి వచ్చి వెళుతున్న యువతి కాబోయే మామ కమలేష్ తో కూడా ఎక్కువగా మాట్లాడటం మొదలుపెట్టింది. అయితే ఇటీవలే ప్రియురాలితో రాత్రి మాట్లాడి పడుకున్న అమిత్ కు పొద్దున లేచే సరికి ఊహించని షాక్ తగిలింది. తన తండ్రి కమలేష్ తో కలిసి ప్రియురాలు లేచిపోయిందని విషయం తెలుసుకుని హడలిపోయాడు. కుటుంబ సభ్యులు కూడా షాకై యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేపట్టారు. పారిపోయిన జంటను అదుపులోకి తీసుకున్నారు. యువతికి ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: