సాధారణంగా ఎవరికైనా సరే చిన్నప్పటినుంచి కాళ్ళకి సాక్స్ వేసుకునే అలవాటు ఉంటుంది. కానీ ఇక్కడ ఒక యువతి మాత్రం చిన్నప్పటినుంచి సాక్స్ తినే అలవాటు ఉంది. ఏంటి సాక్స్ తినడమా.. అదేం అలవాటు అని ఆశ్చర్యపోతున్నారు కదా.. చాలా మందికి సాక్స్ వాసన అంటే నచ్చదు ఒకవేళ ఎక్కడైనా సాక్స్ కనిపించిందంటే వాటిని దూరంగా పెట్టడానికి ఇష్టపడతారు. కానీ ఇక్కడ మాత్రం ఓ యువతి అందరూ చీదరించుకునే సాక్స్ నీ నోట్లో పెట్టుకుని నమిలేస్తోంది. చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు ఇక పెద్దయ్యాక కూడా అలాగే కంటిన్యూ చేస్తూ వస్తుందట.
కానీ చివరికి ఈ సీక్రెట్ కాస్త బాయ్ ఫ్రెండ్ తెలియడంతో సోషల్ మీడియాలో సదరు యువకుడు ఈ విషయాన్ని పంచుకున్నాడు. ప్రతి రోజు తన బాయ్ ఫ్రెండు నిద్రపోయిన తర్వాత యువతి సాక్స్ నములుతూ ఉందట. ఓ రోజు ఈ విషయాన్ని గమనించాడు సదరు యువకుడు దీంతో తన ప్రియురాలి అలవాటు చూసి అతనికి ఫ్యూజులు ఎగిరిపోయాయ్. అయితే ఈ విషయంపై ప్రియురాలుని ప్రశ్నిస్తే అతని తో మాట్లాడటమే మానేసిందట సదరు యువతి. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ విషయంపై భిన్నంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి