తెలుగు సినీ ప్రేక్షకులకు వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్జీవీ అంటేనే సంచలనం. ఓ వైపు సినిమాలు తెరకెక్కిస్తూనే.. మరోవైపు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే వర్మ సినిమాల కంటే కూడా కాంట్రవర్సీలకే ప్రాధాన్యం ఇస్తుంటారు. ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్ సినిమాలు తీసే ఈయన ప్రస్తుతం వివాదాస్పద సినిమాలు మాత్రమే చేస్తున్నారు.


అయితే తెలంగాణలో బర్రెలక్క ఓ సంచలనం. కేసీఆర్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇలా రాజకీయాల్లో తలలు పండిన వారితో సమానంగా  క్రేజ్ సంపాదించుకుంటుంది. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా.. ఈ ఎన్నికల బరిలో నిలిచి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. సామాన్యురాలిగా బరిలో దిగిన ఆమె ఇప్పుడు అసమాన్యురాలిగా మారింది. రోజురోజుకు ఆమెకు పెరుగుతున్న క్రేజ్ చూసి ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో గుబులు మొదలైంది.


మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ, మత బోధకుడు రాజాతో పాటు పలువురు నాయకులు అండగా నిలుస్తున్నారు. కొందరు నగదు రూపేనా సాయం చేస్తుంటే మరికొందరు మాట సాయం చేస్తున్నారు. ఇటీవల వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఆమెకు మద్దతు ప్రకటించారు. ఎప్పుడూ రాజకీయ నాయకులపై విమర్శలు చేసే ఆర్జీవీ మొదటిసారి ఓ సామాన్యురాలిపై అది పాజిటివ్ గా పోస్టు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.


బర్రెలక్క నేటి మహాత్మా గాంధీగా అభివర్ణించారు. ఆనాడు జాతిపిత గాంధీ కూడా బర్రెలక్క మాదిరిగానే అన్యాయాన్ని ఎదురిస్తూ ఉద్యమానికి తెర లేపారని గుర్తు చేశారు. బర్రెలక్కను మహాత్మాగాంధీతో పోల్చుతూ తన ధైర్యాన్ని అభినందించారు.  అయితే పవన్ కల్యాణ్ కంటే బర్రెలక్క ఎంతో మేలని పోస్టు  చేశారు. చూస్తుంటే పవన్ కన్నా సీరియస్ గా రాజకీయాలు చేస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఎలాంటి ఆధారం లేకుండా చిన్న వయసులో ప్రభుత్వాన్ని ఎదురిస్తూ నిరుద్యోగుల కోసం పోరాడుతున్న బర్రెలక్క అలియాస్ శిరీషను అందరూ అభినందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: