రాజకీయాల్లో టైమింగ్ చాలా ఇంపార్ట్మెంట్. చదరంగం ఆటలో ఎత్తులు ఎంత వేగంగా వేయాలో రాజకీయాల్లో కూడా ఎత్తులు, పై ఎత్తులు అంతే జాగ్రత్తగా, వేగంగా వేయాలి. లేకపోతే ప్రత్యర్ధి చేతిలో దెబ్బడిపోతుంది. కొద్దిరోజులుగా వైజాగ్ జిల్లా పాలిటిక్స్ అంతా టిడిపి ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు వర్సెస్ మంత్రి అవంతి శ్రీనివాసరావు చుట్టూనే తిరుగుతున్నాయి. నిజానికి ఈ ఇద్దరు శ్రీనివాసరావులు ఒకపుడు అత్యంత సన్నిహితులే. వీళ్ళ ప్రయాణం ప్రజారాజ్యం నుండి తెలుగుదేశంపార్టీ దాకా కలిసి సాఫీగానే సాగింది. అయితే చివరలో ఎక్కడ తేడా కొట్టిందో తెలీదు కానీ హఠాత్తుగా అనకాపల్లి  టిడిపి  ఎంపిగా అవంతి రాజీనామా చేసేసి వైసిపిలోకి చేరిపోయాడు. ముందు అవంతి రాకను కూడా వైసిపి నేతలు కొందరు వ్యతిరేకించినా పార్టీలో నెంబర్ 2  విజయసాయిరెడ్డి సముదాయింపుతో వ్యతిరేకతంతా సద్దుమణిగిపోయింది.




తర్వాత భీమిలీలో పోటి చేయటం మంచి మెజారిటితో గెలవటం తర్వాత ఏకంగా మంత్రే అయిపోయాడు. సీన్ కట్ చేస్తే గంటా విషయం కాస్త తిరగబడింది. ఎన్నికలకు ముందే గంటా కూడా టిడిపి నుండి వైసిపిలోకి వద్దామని ప్రయత్నం చేసినా సాధ్యంకాలేదు. లోకల్ లీడర్లు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో గంటా జాయినింగ్ నిలిచిపోయింది. తర్వాత టిడిపి చిత్తుగా ఓడిపోయినా వైజాగ్ సిటి నార్త్ నియోజకవర్గంలో గంటా మాత్రం గెలిచాడు. అప్పటి నుండి గంటా మనసంతా వైసిపి చుట్టూనే తిరుగుతున్నట్లు రెండు పార్టీల్లోను ప్రచారం మొదలైంది. ఎప్పటికప్పుడు గంటా వైసిపిలోకి వచ్చేస్తాడనే ప్రచారం  జరగటం తర్వాత తుస్సుమనటం అందరికీ తెలిసిందే.  ఈ ప్రచారమంతా ఎల్లోమీడియా చానల్స్ లోనే ఎక్కువగా జరుగుతోంది. ఇందులో భాగంగానే గడచిన 15 రోజులుగా మాత్రం ప్రచారం మరింత ఉధృతంగా జరిగింది.




వైసిపిలో గంటా ఎంట్రీ  ప్రచారం ఎంతస్ధాయిలో జరుగుతోందంటే  ఏకంగా గంటా చేరికకు ముహూర్తం కూడా  ఫిక్సయిపోయిందట. ఈ నేపధ్యంలోనే గంటా ఎంట్రీకి బ్రేకులు పడిపోయిందంటూ కొత్త ప్రచారం ఊపందుకుంది. అదేమంటే అవంతి దెబ్బకు గంటాకు నో ఎంట్రీ బోర్డు ఎదురైందంటూ చెబుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే గంటా మేనల్లుడు విజయ బాబును పోలీసులు ఈమధ్యనే అరెస్టు చేశారు. భూ కబ్జా కేసులో విజయే కీలక వ్యక్తిగా చెప్పిన పోలీసులు కేసు బుక్ చేయటమే కాకుండా అరెస్టు కూడా చేసేశారు. ఎప్పుడో 1991లో ప్రభుత్వం వికలాంగుల కోసం కేటాయించిన భూమిని 2014 తర్వాత కబ్జాకు గురైందట. గంటాను అడ్డం పెట్టుకుని విజయ అండ్ కో సదరు భూమికి నకిలీ పత్రాలు సృష్టించి ఓనర్లను సృష్టించి ఎవరిపేరుపైనో విజయ్ రిజిస్టర్ కూడా చేయించేశాడట.




ఈ విషయాన్ని అవంతే ఇపుడు బయటపట్టాడని పార్టీలో టాక్ నడుస్తోంది.  మొత్తం ఆధారాలతో అవంతీ పెద్ద ఫైలే రెడీ చేసి ప్రభుత్వానికి అందించాడట. ఎలా సాధ్యమైందంటే జరిగిన భూకబ్జాలో ఎక్కువ భాగం భీమిలీ నియోజకవర్గంలోకే వస్తుందట. ఎలాగూ అవంతి నియోజకవర్గం భీమిలీనే కాబట్టి ఆధారాలు సేకరించటం పెద్దగా కష్టంకాదు. ఇప్పటికే గంటాపైనే భూకబ్జా ఆరోపణలున్నాయి. దానికి బోనస్ గా మేనల్లుడు మీద కేసు, అరెస్టు. దాంతో మొత్తం వ్యవహారమంతా జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళిందట. ఇంకేముంది గంటా ఎంట్రీకి పర్మినెంట్ గా రెడ్ కార్డు పడిపోయిందనే టాక్ నడుస్తోంది. మొత్తానికి సరైన టైం చూసి అవంతి గంటాకు చెక్ పెట్టాడనే అనుకుంటున్నారు. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: