గీత కార్మికుల కోసం సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొత్త పాలసీ తెచ్చి వారికి భద్రత కల్పించారని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ అంటున్నారు. పాదయాత్రలో గీత కార్మికుల కష్టాలను తెలుసుకొని అధికారంలోకి వచ్చాక  పాలసీ తెచ్చారన్నారు. చంద్రబాబు హయాంలో విద్యార్థులు చదువుకు దూరమయ్యారని,  వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థులకు ఉన్నత చదువులు అందుబాటులోకి వచ్చాయని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ  అన్నారు.


సీఎం వైయస్‌ జగన్‌ గీత కార్మికులకు చేసిన మేలులకు రాష్ట్ర వ్యాప్తంగా వారు కృతజ్ఞతలు, పాలాభిషేకాలు చేస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు చేసే ప్రభుత్వంలో తాము మంత్రిగా, కార్పొరేషన్‌ చైర్మన్లుగా ఉండటం సంతోషంగా ఉందని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ తెలిపారు. గీత ఉప కులాలకు సీఎం వైయస్‌ జగన్‌ తెచ్చిన కొత్త పాలసీతో ఆ కులాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ వివరించారు.


అందుకే ఆ కులాల ప్రజలు సీఎం చర్యలకు కృతజ్ఞతగా  వైయస్‌ జగన్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు, ప్రదర్శనలు, ర్యాలీలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ  తెలిపారు. ప్రధానంగా బీసీ ఉప కులాలు వివిధ జిల్లాల్లో గీతా కార్మికులు తమ వృత్తిని కోల్పోయిన తరువాత విద్య ద్వారా ఉన్నతంగా ఎదిగారని... వైయస్‌ రాజశేఖరరెడ్డి సీఎం కాకముందు గీతా వృత్తిలో చదువుపై ఆసక్తి ఉన్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేదని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ అంటున్నారు.


తల్లిదండ్రులపై ఆధారపడి చదువుతున్న విద్యార్థుల ఖర్చులను భరించలేక మధ్యలోనే ఆపేసేవారని... వైయస్‌ రాజశేఖరరెడ్డి 2007లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రవేశపెట్టాక..ఈ వృత్తిలో ఉన్న అనేక మంది బిడ్డలు ఉన్నత చదువులు చదివారని... వారిలో కొంత మంది విదేశాలకు వెళ్లారని  మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: