
ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ టిడిపి తో ఏపీలో పొత్తుకు సై అంటుంది. కానీ అదే సమయంలో బీజేపీతో కూడా పొత్తుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటిస్తున్నాడు. కానీ దాన్ని సస్పెన్స్ లోనే ఉంచుతున్నారు. ఇప్పుడు అసలు సమస్య ఏమిటంటే టిడిపి తో జనసేన పొత్తు పెట్టుకుంటే భాజపా వారు ఏపీలో పవన్ తో కలవరు. పోనీ కలిస్తే అక్కడ టిడిపి వారు ఉంటారు. దీంతో మళ్లీ వారిరువురి మధ్య విభేదాలు వస్తాయి.
ఉదాహరణకు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌తో కలవలేదు. కానీ బయట నుంచి మద్దతు కూడగట్టుకుని ఉంటుంది. ఇక్కడ కమ్యూనిస్టులు సైతం బిజెపితో ఎప్పటికీ కలవరు కలవలేరు. వారి రాజకీయ సిద్ధాంతాలు వేరు వీరి రాజకీయ సిద్ధాంతాలు కాబట్టి వారూ కలవరు. ఇంత సిద్ధాంతాలు వేరైనప్పటికీ కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో కలిశారు. కానీ బిజెపితో కలవాలని కోరుకోరు. ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఈ పొత్తుల విషయమే ఎందుకంటే రాజకీయంగా జగన్ ని వైసిపి పార్టీని ఓడించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ టిడిపి ఎత్తులు వేస్తుంది.
దీనికి బిజెపిని కూడా కలుపుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఒకవేళ పవన్తో బిజెపి కలవకపోతే బిజెపిని వేరే రకంగా చూపించే ప్రయత్నాన్ని టీడీపీ జనసేన పార్టీలు చేసే అవకాశం ఉంటుంది. దీంతో బిజెపికి ఏపీలో ఓటింగ్ శాతం తగ్గిపోతుంది. కాబట్టి పవన్ తీసుకునే నిర్ణయం బిజెపికి చేటు చేస్తున్న లాభం చేకూరుస్తుందా అనేది త్వరలోనే తేలిపోతుంది.