అంతరిక్షంలోకి రాకెట్లను పంపించడంలో తప్పు లేదు. రాకెట్లు అక్కడ ఉండేందుకు దాని ద్వారా ప్రయోజనం పొందేందుకు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. భవిష్యత్తులో వేరే గ్రహాల్లో కూడా ఉండేలా ఎలాంటి ప్రయత్నాలు చేయాలో కూడా అన్ని ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. 2027 సంవత్సరంలో అమెరికాలోని నాసా సరికొత్త ప్రయోగం ప్రవేశపెట్టనుంది. అంతరిక్షంలోకి న్యూక్లియర్ ను తీసుకెళ్లడం.. సైన్స్ అంటే ప్రయోగం కొత్త విషయాలను కనుగొనడం. వాటిని మనిషి తనకు అనుకూలంగా మలుచుకుని జీవన గమనంలో ఉపయోగించుకోవడం. కానీ న్యూక్లియర్ ను అంతరిక్షంలోకి పంపడమనేది సాహసమనే చెప్పాలి. దీని ద్వారా వారు ఏం సాధించాలనుకుంటున్నారు.?


అణ్వస్త్రాలను అంతరిక్షంలోకి పంపడం వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? అసలు దాని వల్ల కలిగే లాభం ఏమిటి సైన్స్ అనేది పది మందికి ఉపయోగపడేలా ఉండాలి. కానీ భవిష్యత్ తరాల వారిని నాశనం చేసేలా కాదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే అణు విద్యుత్ కర్మాగారాల్లో ఏ మాత్రం లీకైన అది ఎంత ప్రమాదకరమో జపాన్ లో సునామీ వచ్చినపుడు అందరూ చూశారు. ఎన్నో ప్రాంతాల్లో అణు ధార్మికత గురించి తెలుసుకొని వాటిని ఆయా ప్రాంతాల్లో నిర్మించాలని అనుకున్నప్పుడు దాన్ని వద్దనుకున్నారు. ఎందుకంటే వాటి పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. రేడియేషన్ కు మనుషులతో పాటు జంతు జాలం కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయి.


అలాంటిది అంతరిక్షంలోకి అణ్వస్త్రాలను తీసుకెళ్లడంపై సైంటిస్టులు ఏమని చెబుతారు? ఇది దేనికి సంకేతం? దీని వల్ల లాభమా నష్టమా? ఎవరికి లాభం..? ఎందుకోసం పంపిస్తున్నారు? ఈ ప్రయోగం వల్ల నాసా సాధించాలనుకుంటున్న లక్ష్యం ఏంటి? దీనితో భూమికి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? అనే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సైన్స్ ను మంచికి ఉపయోగిస్తే అది ఎంతో మేలు చేస్తుంది. కానీ అదే సైన్స్ ను చెడుకు వాడితే మన భవిష్యత్ తరాలే నష్టపోతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: