తైవాన్ ను ఆక్రమించుకోవడానికి చైనా యుద్ధం ద్వారా కాకుండా పరోక్షంగా అక్కడి అధికార నాయకులను బుట్టలో వేసుకుని కైవసం చేసుకోడానికి ప్రయత్నిస్తోంది. గతంలో టిబెట్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలే చేసింది డ్రాగన్ దేశం. టిబెట్ లో ఉన్న1 మిలియన్ మంది చిన్నారులను చైనాకు తీసుకెళ్లిపోయారు. అక్కడ వివిధ ప్రాంతాల్లో వారిని ఉంచి చైనా దేశం గొప్పతనం, మాండరిన్ భాషే ప్రపంచంలో అత్యుత్తమమైనదని నేర్పించడం జరిగింది. వారికి సంబంధించిన సొంత భాష కూడా నేర్పలేదు. బౌద్ధరామాలను కూల్చి వేశారు.


చైనా సంస్కృతి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది అని 1 వ తరగతి పిల్లల నుంచే నేర్పిస్తారు. తద్వారా టిబెట్ దలైలమా గురించి ఏమీ తెలియకుండా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. 18 నుంచి 20 ఏళ్లు వచ్చాక వారిని టిబెట్ లో విడిచి పెడతారు. దీని ద్వారా వారి సంస్కృతి కాకుండా చైనా సంప్రదాయాలే పిల్లలకు అలవాటు అవుతాయి. చైనా టిబెట్ లోని సిచివాన్ లో బౌద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేసింది. 2021లో 91 బౌద్ధ విగ్రహాలను ధ్వంసం చేశారు. టిబెట్ సంస్కృతిని మొత్తం మార్చేస్తున్నారు.


టిబెట్ అమ్మాయిలకు చైనా అబ్బాయిల్ని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. టిబెట్ నుంచి వేరే దేశానికి వెళ్లాలంటే చైనా పాస్ పోర్టు తోనే వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. టిబెట్ వ్యతిరేక ఉద్యమాల్ని అణిచివేస్తున్న పనిని చైనా ఒక ప్రణాళిక ప్రకారం చేస్తుంది. దీంతో టిబెట్ లో చైనా సంప్రదాయాలు, సంస్కృతి పెంచడంలో సఫలమవుతోంది.


టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామా ప్రస్తుతం భారత్ లో తలదాచుకుంటున్నారు. బౌద్ధరామాలను కూల్చివేయడం, మత గురువును దూరం చేయడం ద్వారా చైనా తను అనుకుంటున్న లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తుంది. 20 ఏళ్లు వచ్చే యువకుడికి కేవలం మాండరిన్ భాష మాత్రమే వస్తుంది. యుద్ధం లేకుండా టిబెట్ ను అధీనంలోకి  తెచ్చుకోవడంలో చైనా తెలివి ప్రదర్శిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: