ఎన్నికలు ఏ క్షణంలోనైనా వస్తాయని తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తలను గత మూడేళ్ల నుంచే సిద్ధంగా ఉంచుతోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయని మూడు సంవత్సరాల నుంచే టీడీపీ ఏపీలో ప్రచారం చేస్తోంది. టీడీపీ కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు 35 అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక జోన్ గా ఏర్పాటు చేసుకుంది. 35 నియోజకవర్గాలకు 1 జోన్ మొత్తం 5 జోన్లుగా విభజించారు.


ఈ అయిదు జోన్లలో ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లాలనే ఆలోచనతో చంద్రబాబు పరిశీలించనున్నారు. ఇక్కడ నియోజకవర్గ ఇంఛార్జిలు, యూనిట్ ఇంఛార్జిల నియామకం చేపట్టనున్నారు. అనంతరం ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది. అక్కడ గెలవాలంటే ఏం చేయాలి. ఇంతవరకు అక్కడ ఉన్న సమస్యలు, వాటిని మన ప్రభుత్వం వస్తే ఎలా పరిష్కరిస్తుందనే వివరాలు క్షేత్రస్థాయిలో ఉన్న వారికి చేరేలా కార్యకర్తలు పనిచేయాలని బాబు సంకల్పిస్తున్నారు.


21 నుంచి జోన్ల వారీగా చంద్రబాబు సమావేశాలు నిర్వహిస్తారు. 21 కడప, 22 నెల్లూరు, 23 అమరావతి, 24 ఎలూరు, విశాఖపట్నంలో జరుగుతాయి. 15, 16, 17 తేదీల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సమావేశాలు జరుగుతాయని తెలుగుదేశం సీనియర్ నాయకులు అచ్చంనాయుడు తెలిపారు. ఒక వైపు యువగళంతో లోకేష్ పాదయాత్ర చేస్తుంటే దాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అడుగడుగునా పోలీసులతో ఎక్కడ కూడా లోకేష్ ని మాట్లాడనీయకుండా చేస్తోంది.


70 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందని దీన్ని త్వరగా అందిపుచ్చుకుంటే ఆయా స్థానాల్లో టీడీపీ గెలుపు నల్లేరుపై నడకేనని భావిస్తోంది. రాష్ట్ర స్థాయి కమిటీ కూడా వేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపొందాలంటే చేయాల్సిన పనులపై చర్చిస్తారని తెలుస్తోంది. ఎక్కడైతే వ్యతిరేకత ఉందో వాటిని తొందరగా కవర్ చేసి మిగతా ప్రాంతాల్లో కాస్త కష్టపడితే అధికారం టీడీపీ సొంతమవుతుందని భావిస్తున్నారు.  బాబు భారీ ప్రణాళిక అమలు విజయవంతమయితే అధికారం టీడీపీ వశం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: