వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధించాలి..ఇదీ జగన్ టార్గెట్.. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సొంత పార్టీ నేతలపై ఆయన పలు సర్వేలు చేయిస్తున్నారు. తాజాగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై పార్టీ నేతలపై సమీక్ష నిర్వహించిన వైఎస్ జగన్.. తాజా రిపోర్టును నేతల ముందు ఉంచి నిలదీసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల పనితీరు పై చేసిన సర్వే నివేదికను ప్రదర్శించిన  సీఎం జగన్.. 30 మంది ఎమ్మెల్యే లు పనితీరు లో వెనుక బడ్డట్లు  వెల్లడించారు.


ఆయా నేతలకు వార్నింగ్ ఇచ్చిన సీఎం జగన్.. పనితీరు మెరుగు పరచుకోవాలని నేతలకు చెప్పారట. చాలా కాలంగా చెబుతున్నా..  పనితీరు మెరుగుపరచుకోని వారిపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అతి తక్కువ రోజులు కార్యక్రమంలో తిరిగిన పలువురు ఎమ్మేల్యేల వివరాలు తెలిపిన సీఎం జగన్... పనితీరు  మెరుగు పరచకపోతే  వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.


గడప గడప గడపకు మన ప్ర భుత్వం  కార్యక్రమంపై నిర్లక్ష్యం ప్రదర్శించవద్దన్న సీఎం జగన్.. మార్చి18 నుంచి 'మా భవిష్యత్తు నువ్వే జగన్' పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈలోగా కన్వీనర్లు, సచివాలయ సమన్వయకర్తలకు శిక్షణ ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. పలు  నియోజకవర్గాల్లో  పెండింగ్ లో ఉన్న గృహ సారథులు, కన్వీనర్ల  నియామకం వెంటనే పూర్తి చేయాలని సీఎం జగన్  పార్టీ నేతలకు ఆదేశం ఇచ్చారు.


అలాగే గృహ సారధులు, పార్టీ కన్వీనర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని ఆదేశించిన సీఎం జగన్.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న  జిల్లాల్లో 'మా భవిష్యత్తు నువ్వే జగన్ 'కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలనే విషయంపైనా చర్చించారు. అలాగే ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని సీఎం జగన్ పార్టీ నేతలకు సూచించారు. మరి సీఎం జగన్ వార్నింగ్‌కు పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో?

మరింత సమాచారం తెలుసుకోండి: