తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడుల సదస్సు ఏడాదికి ఒకసారి జరిగింది. 10 ఏళ్లలో 20 లక్షల కోట్ల పెట్టుబడి లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. అందులో ఒక కియా మాత్రం వచ్చింది. విజయవాడ, తిరుపతి, అమరావతి లాంటి నగరాలను ఉద్యోగాలు చేసే వారు ఎంపిక చేసుకోవడం లేదు. కేవలం హైదరాబాద్, బెంగుళూరు లాంటి మెట్రో నగరాలకే పరిమితం అవుతున్నారు.


దీన్ని దూరం చేయడానికి విశాఖపట్నం లాంటి నగరం ఉంది. ఇది అన్ని సౌకర్యాలకు నిలయం అని చెప్పెందుకే ఈ గ్లోబల్ సమ్మిట్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీస్ ను విశాఖ కు రప్పించి అదే మెట్రో సిటీగా మార్చే పనిలో ఉన్నట్లు ఇన్వెస్టర్లను ప్రోత్సహించేలా ప్రభుత్వం ఈ గ్లోబల్ సమ్మిట్ ను ఏర్పాటు చేసింది.


అదానీ, అంబానీ, బిర్లా, బజాజ్, జిందాల్, దాల్మియా తదితరులను పిలిచారు. వారంతా వచ్చేశారు. దాదాపు 24 ఛార్టర్డ్ ప్లయిట్స్ ను బుక్ చేశారు. వీరి రాకతో ఇప్పుడు పెట్టుబడుల వరద పారుతోంది. తొలి రోజే దాదాపు 12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం చెబుతోంది. సోలార్ పవర్ ప్లాంట్స్, జిందాల్ సంస్థకు సంబంధించిన స్టీల్ ప్లాంట్స్, శంకుస్థాపన పూర్తయి పనులు నడుస్తున్నాయి. భారీ పారిశ్రామిక వేత్తలు విశాఖకు జై కొట్టారనే చెప్పాలి.  


పెట్టుబడులకు విశాఖ ఓకే అయితే నగరం మరింత అభివృద్ధి దిశగా దూసుకుపోతుందనేది నిజం. కానీ పారిశ్రామిక వేత్తలను ఒప్పించి, ఇక్కడ వనరులను వారు మెచ్చే విధంగా ప్రభుత్వం చూపాల్సిన అవసరం ఉంది. విశాఖ కేంద్రంగా ఈ సారి పెట్టుబడులు అనేవి సక్సెస్ అవుతాయా అంటే అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే అమరావతి కేంద్రంగా గతసారి జరిగిన గ్లోబల్ సమ్మిట్ ఫెయిల్ అయింది. మరి ఇప్పుడు ప్రకటించిన సంస్థల్లో  ఎన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: