
జగన్ ని దెబ్బ కొట్టాలంటే పక్కనున్న విజయ్ సాయి రెడ్డిని టార్గెట్ చేస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తారు. లేదా సునీల్ ని టార్గెట్ చేస్తారు. ఇలా పక్కన ఉన్న వాళ్ళని ముందుగా టార్గెట్ చేస్తారు. రాజు ఎప్పుడైతే తన వాళ్ళని పక్కన పెడతారో లేదా డౌన్ ప్లే చేస్తారో అప్పుడు ప్రత్యర్థి సక్సెస్ సాధించినట్టు. దానికి తాజా ఉదాహరణ ఉత్తరాంధ్ర ఎలక్షన్స్. విజయసాయిరెడ్డి రాజకీయ నాయకుడు కాదు. ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఆడిటర్.
విజయసాయిరెడ్డి బుర్ర ఉన్నవాడు. అందుకే పార్లమెంట్ లో వాదనలు గాని, కేంద్ర ప్రభుత్వంతో లాభీయింగ్ లో గాని సక్సెస్ అవుతున్నాడు. అలాంటి విజయ్ సాయి రెడ్డిని ప్రత్యర్థి పార్టీల వాళ్లు టార్గెట్ చేయడంతో, ఆయనకు బదులు ఉత్తరాంధ్రకు వైవి సుబ్బారెడ్డిని ఇచ్చారు. అక్కడే ఆ పార్టీకి దారుణ పరాభవం ఎదురయింది. మొదటి ఓటును వెయ్యని వాళ్ళని రెండో ప్రాధాన్య ఓటునైనా వేయండి అని సమన్వయం చేసుకోవడంలో ఫెయిల్ అయింది పార్టీ అక్కడ.
విజయ సాయి రెడ్డి ఉండగా విశాఖ స్టీల్ ప్లాంట్ వివాదం ఉంది, రైల్వే జోన్ అంటూ కూడా అప్పట్లో ఆయన్ని టార్గెట్ చేశారు. ఆయన పై అవినీతి ఆరోపణలు జరిగినా ఎదుర్కొన్నాడు, సమాధానం చెప్పాడు, రుజువులు చూపించాడు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అలా అసలు ఉత్తరాంధ్రలో అపజయాలే లేకుండా చేశాడు. ఆయన్ని పక్కన పెట్టడం తో ఇప్పుడు దాని పర్యవసనాన్ని తాజాగా చవి చూసిన పరిస్థితి.