2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఓటమి పాలైంది. అనంతరం జరిగిన 2009 ఎన్నికల్లో కూడా టీడీపీ కమ్యూనిస్టులు, తెరాస, మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకుని మరి ఓడిపోయింది. దీంతో టీడీపీ రాజకీయ భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న ఉద్భవించింది. కానీ టీడీపీ 2014 ఎన్నికలు వచ్చేసరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది. ఒక రకమైన విభిన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతకుముందు చంద్రబాబు నాయుడు తెలంగాణ ఉద్యమం సమయంలో రెండు కళ్ల సిద్ధాంతం ద్వారా తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ టీడీపీ పార్టీ ఉండాలని భావించారు.


అటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో కూడా పార్టీ దెబ్బతినే పరిస్థితి నెలకొంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో టీడీపీ 18 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది.  2014 ఎన్నికలకు వెళ్లక ముందు చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర టీడీపీ పార్టీలో సమూల మార్పులను తీసుకురావడమే కాక క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ప్రజల మనసులో ఉన్న విషయాలను కనిపెట్టడానికి పనికొచ్చింది.


దీన్నే ఒక స్ట్రాటజీగా మార్చుకొని ఎన్నికలకు వెళ్లారు. టీడీపీకి  సోషల్ మీడియా విభాగం బ్రింగ్ బ్యాక్ బాబు అనే నినాదంతో ప్రజలకు టీడీపీ అవసరమేంటి అనే విషయం  తెలియజెప్పారు తద్వారా విడిపోయిన రాష్ట్రంలో ఆంధ్ర ప్రదేశ్ బాగుపడాలంటే కచ్చితంగా బాబే ముఖ్యమంత్రి కావాలని ప్రచారం చేశారు. అనుభవం రీత్యా విడిపోయిన రాష్ట్రంలో చంద్రబాబు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని భావించేటట్లు ప్రజలకు వివరించి చెప్పారు.


తద్వారా టీడీపీ  వైసిపి పై విజయం సాధించి ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం 2019 ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలో ఉంది.ఇప్పుడు కూడా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది అని చెప్పేసి సోషల్ మీడియాలో బ్రింగ్ బ్యాక్ బాబు అగైన్ అనే నినాదంతో టీడీపీ సోషల్ మీడియా ప్రజల్లోకి వెళుతుంది.  ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: