కర్ణాటకలో కనుక కాంగ్రెస్ గెలిస్తే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. లేదా కాంగ్రెస్ సంకీర్ణమైనా, కాంగ్రెస్ కి అక్కడ మెజార్టీ వస్తుందని చెప్తున్నారు. లేదా జెడిఎస్ తో కలిసి సంకీర్ణం ఏర్పాటు చేస్తుందని చెప్తున్నారు. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి రికార్డు బద్దలైపోతుందని తెలుస్తుంది. 510కోట్లతో దేశంలోనే అత్యంత ధనవంతుడుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి పేరు ఉంది.


దేశంలోనే అందరి ముఖ్యమంత్రులు కన్నా అత్యంత కోటీశ్వరుడైన ముఖ్యమంత్రి జగన్ అనే రికార్డ్ ఆయనకు ఉంది. దేశంలోని ముఖ్యమంత్రులు అందరు దగ్గర ఉన్న ఆస్తిని కలిపితే ఎంత వస్తుందో, ఎంత అవుతుందో దానికి డబుల్ ఉంటుందంట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ఇప్పుడు కర్ణాటకలో డీకే శివకుమార్ కనుక ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారి రికార్డు ఈజీగా బ్రేక్ అయిపోతుందని తెలుస్తుంది.


ఆయన దగ్గర, దేశంలోని ముఖ్యమంత్రుల అందరికన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే ఆయన కన్నా ఎక్కువ డీకే శివకుమార్ గారి దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన తన ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తి 1413 కోట్లని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యుల ఆస్తి పెరుగుతున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా ఎన్నికల అఫిడవిట్ లో తన కుటుంబ సభ్యులందరి ఆస్తి మొత్తం కలిపి 1413 కోట్లని ఆయన పేర్కొనడం సంచలనం అయ్యింది.


ఇది ఆయన 2018 ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న 840 కోట్లతో పోల్చుకుంటే ఇది 68 శాతం ఎక్కువ. 2018లో కనక ప్రస్థ నుంచి ఎమ్మెల్యే గా నెగ్గిన ఆయన ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు.  డీకే శివకుమార్ పై ఇప్పటివరకు 19కేసులు ఉన్నాయి. ఆయన ప్రతిపక్షంలో ఉంటూ కూడా ఆరేళ్లలో 600కోట్లు సంపాదించారవి తెలుస్తుంది. ఇలా ఏ విధంగా సంపాదించగలిగారు ఆయన చెప్పితే ప్రపంచమంతా ఉపయోగపడుతుందని కొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: