పాకిస్థాన్ లో ఉన్న నాయకులకు నోటి దూల ఎక్కువని  తెలిసిన విషయమే. పాకిస్థాన్ భారత్ ల మధ్య మళ్లీ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుంది. జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీ, పూంచ్ జిల్లాలో ఉన్న పేద ముస్లిం పిల్లలనే టార్గెట్ చేసుకుని తీవ్రవాదం వైపు మళ్లించడానికి పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది.


దీనికి అసలు కారణం కూడా చెప్పింది. మొన్న పూంచ్ జిల్లాలో జరిగిన ఉగ్ర దాడిలో అయిదుగురు జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏటాక్ కు సంబంధించి కేవలం ఉగ్రవాదులు డైరెక్టుగా వచ్చి చేసిన దాడి కాదని ఆ ప్రాంతంలో ఉన్న వారి ప్రమేయం తప్పకుండా ఉందని భావిస్తున్నట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొంది. పాకిస్థాన్ కు చెందిన తీవ్రవాద సంస్థలు పూంచ్, రాజౌరీ జిల్లాలకు చెందిన పేద గిరిజన యువకులకు డబ్బులిచ్చి వారితో ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నట్లు చెప్పింది.


గతంలో ఇండియాలో నక్సలైట్ల లో పేదవారు, ఆకలితో అలమటించే వారు, దోపిడికి గురైన వారు చేరి నక్సల్స్ భావజాలాలకు అనుగుణంగా పని చేసే వారు. అలాంటి విధానాలతో ప్రస్తుతం పాక్ ఉగ్రవాద సంస్థలు పని చేస్తున్నాయి. కాశ్మీర్ యువతకు తీవ్ర వాద భావజాలాల్ని నూరి పోసి వారికి శిక్షణ ఇచ్చి, బాంబులను ఎప్పుడు ఏ ప్లేస్ లో పేల్చాలో చెబుతోంది.


దీని వల్ల తీవ్రవాదం రోజు రోజుకు పెచ్చరిల్లి పోతుంది. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థానికంగా ఉన్న యువత ఉగ్రవాదులకు మద్దతు తెలపడం మొదలుపెడితే రాబోయే రోజుల్లో ఇండియాకు, సైన్యానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. అయితే ఇప్పటికీ పాకిస్థాన్ అనుకూలవాదులు ఈ జిల్లాల్లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వారికి చైతన్యం కలిగించే కౌన్సిలింగ్ ఇప్పించి భారత దేశం, ఆర్మీ గొప్పదనం తెలియజేయాలి. పాకిస్థాన్ పన్నుతున్న కుట్రలు, వారు చేసే అరాచకాలపై అవగాహన కల్పించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: