జమ్ము కాశ్మీర్ లోని పూంచ్ లో మొన్న భారత సైన్యంపై దాడి చేసినటువంటి తీవ్రవాదులను తీవ్రంగా గాలిస్తున్నాము దొరికిన వెంటనే వాళ్ళని, ఆ తీవ్రవాదుల్ని కాల్చిపారేస్తామంటూ చెప్తుంటే, వాళ్లకు సహకరించాడు అని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి మాత్రం తన కుటుంబాన్ని బాధపెడుతున్నారు వేధిస్తున్నారు.. నేను భారత్ మద్దతు దారుడినే అంటూ ఓవరాక్షన్ చేస్తూ వీడియో పెట్టడం ఇప్పుడు ఇష్యూ అయింది అని తెలుస్తుంది.


అయితే ఇక్కడ జరుగుతున్న మరో ప్రత్యేక అంశం ఏమిటంటే ఒక పక్కన పోలీసుల మూమెంట్ ఉంటే మరో పక్కన ఇంటర్ పోల్, ఏదైతే ప్రపంచ వ్యవస్థల మధ్యన అనుసంధానికి  ఉపయోగపడుతుందో ఆ ఇంటర్ పోల్ కి జమ్మూ కాశ్మీర్ పోలీసులు పూంచ్ లో జరిగినటువంటి దాడికి వెనక ఉన్నటువంటి ఏడుగురు కమాండర్ల పేర్లు, అడ్రస్ లు అన్ని ఇంటర్ పోల్ వాళ్ళకి ఇచ్చి పాకిస్తాన్ దగ్గర ఉన్న ఈ ఏడుగురిని భారత్ కి అప్పగించమని అడగమని కోరుకోవడం జరిగిందని తెలుస్తుంది.


వాళ్ల తీవ్రవాదులు కాదు అని పాకిస్తాన్ అంటే అప్పుడు భారత్ ప్రపంచానికి చెప్తుంది ఇదిగో వీళ్ళు తీవ్రవాదులు కాదంటా, పాకిస్తానే వీళ్ళతో ఈ విధంగా చేయిస్తుంది అంటూ చెప్పడానికి ఉంటుంది. అలాగని వాళ్ళను అప్పచెప్పుతుందా అంటే అప్పజెప్పదని తెలుస్తుంది. రూల్ ప్రకారం అక్కడ వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేసి భారత్ రుజువులు ఏమి సమర్పించలేదు కాబట్టి కేసు కొట్టేస్తున్నామని చెప్పాలి.


ముందైతే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తే ఆ తీవ్రవాదులు పాకిస్తాన్ లో వాళ్ళ దగ్గరే ఉన్నట్లుగా తెలిసిపోతుంది. తెలిసిపోతే మొన్నటి వరకు ఎఫ్ ఎ టి ఎఫ్ నిబంధనల ప్రకారం అమెరికా ఇచ్చింది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు వాళ్లు పాకిస్తాన్లో ఉన్నట్టయితే ఎఫ్ ఎ టి ఎఫ్ నిబంధనలు ప్రకారం పాకిస్తాన్ తీవ్రవాదులను పోషిస్తుందని తేలిపోతుంది ఈ దెబ్బతో. దీనితో పాకిస్తాన్ ను వెనకుండి నడిపించే  అమెరికా, యూరప్ దేశాలకు  షాక్ ఇచ్చినటువంటి విషయం అయ్యింది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: