తెలంగాణలో కెసిఆర్ కమ్యూనిస్టులతో  పొత్తు ఖరారు చేసుకున్నారు. ఎంఐఎం తో ఆల్రెడీ ముందు నుండి పొత్తు ఉంది. కానీ భారతీయ జనతా పార్టీతో ఢీకొనాలంటే ఆయనకి ఇప్పుడు కాంగ్రెస్ అవసరమవుతుంది అన్నట్లుగా తెలుస్తుంది. 50-50 సీట్లు పంచుకుంటే సంకీర్ణానికి కుదరదు. అలా ఎలాగూ ఇవ్వలేరు కాబట్టి ఒక పాతిక సీట్లు కాంగ్రెస్ కు ఇచ్చి పొత్తు ఖరారు చేసుకోవడం కెసిఆర్ ప్లాన్ అని తెలుస్తుంది.


అయితే ఈ ఒప్పందం కాంగ్రెస్ లోని జానారెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి లాంటి వాళ్లకి ఓకే అని తెలుస్తుంది. కానీ ఈ ఒప్పందం కాంగ్రెస్ లోని రేవంత్ రెడ్డికి, అద్దంకి దయాకర్ ఇంకా షబ్బీర్ అలీకి ఇష్టం లేదన్నట్లుగా తెలుస్తుంది. వీళ్ళు మాత్రం టిఆర్ఎస్ తో పొత్తు లేకుండానే కాంగ్రెస్ ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారని తెలుస్తుంది. మొన్న కర్ణాటకలో కెసిఆర్ పోటీ చేయకపోవడానికి కూడా కారణం భయం అని తెలుస్తుంది ఎందుకంటే ఒకచోట పోటీ చేసి ఓడిపోతే దాని ఎఫెక్ట్ మరో చోట పడే అవకాశం ఉంది.


గతంలో తెలుగుదేశం కూడా తెలంగాణలో పోటీ చేసి ఓడిపోతే దాని ఎఫెక్ట్ ఆంధ్రలో పడింది. అందుకనే కెసిఆర్ కర్ణాటకలో పోటీ చేయలేదని తెలుస్తుంది. కానీ కెసిఆర్ కి రాబోయే అసలు సమస్య కాంగ్రెస్ తోనే ఉంది. అది ఏంటంటే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోదని తెలుస్తుంది. అంతేకాకుండా కర్ణాటకలో ఎటువంటి సంక్షేమ పథకాలు అనౌన్స్ చేశారో తెలంగాణలో కూడా అటువంటివే అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.


టిఆర్ఎస్ వాళ్ళు అనౌన్స్ చేసిన దానికన్నా ఎక్కువే చేస్తారు. ప్రతి ఇంటికి ఇంత డబ్బులు అని జగన్ లానే వాళ్ళూ అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. అదే గనక జరిగితే కేసీఆర్ కి తెలంగాణలో  పెద్ద సమస్య అవుతుంది . ఆ తర్వాత టిఆర్ఎస్ కూటమి లెక్కలు మారతాయని అటు బిజెపితోనో, కాంగ్రెస్ తోనో కలిసి వెళ్లొచ్చని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: