గూఢచర్యం అది ప్రతి దేశానికి, ప్రతి దేశపు మనుగడకు అవసరమే. ఎందుకంటే తమ దేశ రహస్యాలు బయటపడనివ్వకుండా చూసుకుంటూనే, మరో దేశపు రహస్యాలు తెలుసుకోవాలి. పక్క వాళ్ళు ఎటువంటి ఆలోచనతో ఉన్నారో ఈ గూఢచర్యం ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు  ఆకస్మికంగా యుద్ధానికి వచ్చే అవకాశం ఉందా, వస్తే వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి, ఎన్ని ఆయుధాలు ఉన్నాయి అనేది దీని ద్వారా తెలుసుకోవచ్చు.


అలాగే అమెరికా కూడా రష్యా దేశంపై గూడచారిని పెట్టిందని తెలుస్తుంది. దీని ద్వారా రష్యా దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, అవి ఎంతకాలం వస్తాయని లెక్క వేసింది అమెరికా. ఆయిల్ కోసం పక్క దేశాల మధ్య యుద్ధాలు పెట్టే అమెరికా అదేవిధంగా ఉక్రెయిన్ ని రష్యా మీదకి పురి గొలిపిందని తెలుస్తుంది. అమెరికా లెక్క ప్రకారం రష్యా దగ్గర మూడు నెలలకు సరిపడా ఆయుధాలు మాత్రమే ఉన్నాయి అని తెలుస్తుంది.


ఆ నమ్మకంతోనే ఉక్రెయిన్ కి ఆయుధాలు ఇచ్చి మరి ఉక్రెయిన్ అధ్యక్షుడిని మధ్యలో ఒక కీలుబొమ్మగా వాడి రష్యాపై ఇండైరెక్టుగా యుద్ధం చేస్తుంది అమెరికా. కానీ మూడు నెలల్లో రష్యా ఆయుధాలు అన్ని ఖాళీ అయిపోతాయని అనుకున్న అమెరికాకి గట్టి ఎదురు దెబ్బ తగిలిందట. ఎందుకంటే అది మూడు నెలలు కాదు కదా, 30 నెలలైనా రష్యా ఇంకా కొత్త కొత్తగా ఆయుధాలను తీస్తూనే ఉంది .  అసలు రష్యాకి ఎవరు ఆయుధాలు ఇస్తున్నారో అర్థం అవడం లేదు ఇప్పుడు అమెరికాకి.


ఈ సందర్భంలో రష్యాకి సౌత్ ఆఫ్రికా నుండి ఆయుధాలు అందుతున్నాయి అన్నట్లుగా అమెరికాకు సంబంధించిన ఒక రాయబారి తెలిపినట్లుగా తెలుస్తుంది. దీనిపై సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు విచారణ జరిపిస్తామని కూడా చెప్పారట. ఒకవేళ ఆయనకు తెలియకుండా ఆ దేశంలోని ఆయుధ కంపెనీలు ఏమైనా సప్లై చేసి ఉండొచ్చు. అది తెలిస్తే ఈయన కంట్రోల్ చేస్తాడని అనుకుంటున్నాయట ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: