రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి మొదట్లోనే ఫ్రాన్స్ ఇంకా టర్కీ ప్రయత్నించాయట. అయితే వీటితో పాటు చిన్నా చితకా దేశాలు కూడా వీటి మధ్య యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేసాయట. అయితే అవి సఫలం కాకపోగా చివరికి యుద్ధం అనివార్యమైనట్లుగా తెలుస్తుంది. దాన్ని మిలటరీ ఆపరేషన్స్ పేరుతో రష్యా సాగిస్తుందట. ఈ మధ్యన చైనా కూడా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి తాను ప్రయత్నిస్తున్నట్లుగా తెలిపిందట.


అయితే ఆ మధ్యన భారతదేశాన్ని కూడా అడిగాడట  జెలెన్స్కి. అయితే ఈ ప్రతిపాదనకు భారత్, మీరు ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలని, మేము జోక్యం చేసుకోకూడదు అని తెలిపిందట. అసలు భారత్ అలా ‌ అనడానికి గల కారణం రేపు ఈ దేశాలు ఏవి కూడా కాశ్మీర్ విషయంలో కలగజేసుకోకూడదని. అయితే దాంతో చైనా నీకు ఎంతో అనుభవం ఉంది జింపింగ్ నువ్వు తలుచుకుంటే  సమస్య సామరస్యంగా ముందుకు వెళుతుందన్నట్లుగా వాళ్ళు చెప్పుకొచ్చారట.


కాబట్టి నువ్వే రష్యా వెనక్కి వెళ్ళిపోయేలా చేయాలి అంటుందట. అసలు ప్లాన్ ఏంటి అంటే ఇప్పటివరకు రష్యా ఆక్రమించుకున్న తన ప్రాంతాలైన లోపాన్స్కీ, జెపోరీజియా, కేర్సన్, డొనేట్స్కి ఈ ప్రాంతాలన్నిటిని తనకు వదిలేసి వెళ్లిపోవాలని ఉక్రెయిన్ ఉద్దేశం అన్నట్లుగా తెలుస్తుంది. మొన్న చైనా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశం అయ్యారు జింపింగ్. శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్తామని ఆయన చెప్పారు.


రష్యాతో ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నారో తెలియలేదు. కాని 12 అంశాలు చర్చకు వచ్చినట్లుగా అయితే చూచాయిగా తెలుస్తుంది. అయితే రష్యా అధ్యక్షుడు ఈ విషయంపై ప్రశ్నిస్తే నేనేం చెప్పాలనుకున్నానో అది ఆల్రెడీ జింపింగ్ కి చెప్పేసాను అని చెప్పారట. అదే సందర్భంలో అధ్యక్షుడు కూడా కలవాల్సి ఉంది. కానీ వర్చువల్ మీటింగ్ అనేసరికి ఉక్రెయిన్ అధ్యక్షుడు దానికి ఒప్పుకోలేదట. నేరుగా రండి అని పిలిచినందుకు  జింపింగ్ ఒప్పుకోలేదట. ఆయన బదులు ఒక రాయబారిని పంపిస్తే ఆ వ్యక్తిని ఉక్రెయిన్ వెనక్కి పంపించేసిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: