చాలామంది తల్లులలో హాలిడేస్ మొదలవగానే వీరి అల్లరి ఎలా భరించాలో అని బయపడుతుంటారు. మరియు పిల్లల్లో లర్నింగ్ స్కిల్స్ కూడా పెంచాలని అనుకుంటూ ఉంటారు.కానీ ఈ మధ్యకాలంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లకు అలవాటు పడి పిల్లల్లో క్రమంగా లర్నింగ్ కెపాసిటీ తగ్గుతూ వస్తుంది.దానికి కారణం ఎక్కువగా ఫోన్,టీవీ,ఎలక్ట్రానిక్ వస్తువులు వాడుతుండడం వల్ల ,వారి మైండ్ మొద్దు మారిపోయి, ఆలోచన శక్తి తగ్గిపోతూ ఉంది.ఈ హాలిడేస్ లో సిమ్మింగ్ నేర్పించడం వల్ల పిల్లల్లో లర్నింగ్ స్కిల్స్ పెంచడమే కాకుండా,ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ హాలిడేస్ లో పిల్లలను,ఎంగేజ్ చేయడానికి క్రమం తప్పకుండా వ్యాయామం,స్విమ్మింగ్ వంటివి చేయడం వల్ల ఆరోగ్యమే కాక,మెదడు కూడా చాలా చురుకుగా పని చేయడానికి ఉపయోగపడుతుందని చాలా పరిశోధనలు చెబుతున్నాయి.ముఖ్యంగా స్విమ్మింగ్ చేయడం వల్ల మెదడులోని భాగం హిప్పోకాంపస్ పరిమాణం ఇంక్రిజ్ అవుతుంది. దీనితో లర్నింగ్ కెపాసిటి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

స్విమ్మింగ్ పిల్లలకు మంచి ఆహ్లాదంతో కూడిన వ్యాయామంగా చెప్పవచ్చు.హాలిడేస్ లో గ్యాడ్జెట్ లో అతుక్కుపోకుండా ఉత్సాహంగా ఉండేందుకు,ఇది ఒక మంచి వ్యాయామం కూడా.మరియు పెద్దలు కూడా స్విమ్మింగ్ చేయడం వల్ల వారికి వాతం వల్ల కలిగే నొప్పులను కూడా తగ్గిస్తుంది.స్విమ్మింగ్ పది నిమిషాలు చేసినా,అరగంట సేపు వ్యాయామం చేసినంత శక్తి లభిస్తుంది.మరియు ఇందులో బ్రీతింగ్ లెవెల్స్ సక్రమంగా ఉండి,గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.కానీ స్విమ్మింగ్ వెళ్ళేటప్పుడు చాలా రకాల జాగ్రత్తగా తీసుకోవాలి.పెద్దలకు సమక్షంలోనే పిల్లలు స్విమ్మింగ్ కి వెళ్ళాలి.మరియు స్విమ్మింగ్ కి వెళ్ళినప్పుడు ఆ ఎండవేడికి తొందరగా డిహైడేట్ అయిపోతూ ఉంటారు.అందువలన ఖచ్చితంగా  వాటర్ బాటిల్ని తమతో పాటు తీసుకువెళ్లాలి.

మరియు పిల్లలు వేడి వల్ల,సన్ టాన్ కాకుండా, మాయిశ్చరైజర్ కానీ,సన్ స్క్రీన్ కానీ రాసుకొని వెళ్లడం చాలా ఉత్తమం.శరీరంలో వేడి తగ్గించేందుకు కూల్ డ్రింక్స్ కి బదులుగా పండ్ల రసాలు, మజ్జిగ వంటివి ఇవ్వడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: