మనీ: మదర్స్ డే సందర్భంగా మహిళలకు అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇకపోతే ఎవరైతే తమ సొంత ఇంటి కల ను సహకారం చేసుకోవాలని భావిస్తున్నారో అలాంటి మహిళల కోసం ఈ బంపర్ ఆఫర్ అని చెప్పాలి. ప్రముఖ ఫైనాన్స్ కంపెనీలలో ఒకటిగా కొనసాగుతున్న శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ తాజాగా స్పెషల్ ఆఫర్ తీసుకువచ్చి మహిళలకు శుభవార్తను అందించింది. ఈ మేరకు ఎవరైతే సొంతింటి కల సహకారం కోసం హోమ్ లోన్ పొందాలని ఆలోచిస్తున్నారో అలాంటి వారికి ఈ ఆఫర్ చాలా ప్రయోజనకరంగా మారనుంది.

తాజాగా శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ హోమ్ లోన్స్ పై.. ప్రాసెసింగ్ ఫీజు తగ్గింపు ఆఫర్ తో మన ముందుకు వచ్చింది.. అంటే ప్రాసెసింగ్ ఫీజులో ఏకంగా 50% డిస్కౌంట్తో మీరు హోమ్ లోన్ పొందవచ్చు అంతేకాదు ఇక్కడ రూ.25 లక్షల వరకు మీకు లోన్ లభిస్తుంది. అది కూడా మదర్స్ డే సందర్భంగా మాత్రమే ఈ ఆఫర్ తీసుకొచ్చినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ఇకపోతే కంపెనీకి చెందిన డైరెక్ట్ 2 కస్టమర్ యాప్ ఎస్ హెచ్ ఎఫ్ ఎల్ ఎస్ ద్వారా హోమ్ లోన్ కోసం అప్లై చేసుకునే వారికి ఈ డీల్ తప్పకుండా అందుబాటులోకి ఉంటుంది.

మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ యాప్ మీ ఫోన్లో ఉంటే చాలు మీరు నేరుగా లోన్ కి అప్లై చేయవచ్చు లేదంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని ఆప్ ద్వారా లోన్ కి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇకపోతే మే నెల మొత్తం ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ ఎండి సీఈవో రవి సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. కస్టమర్లకు యాక్సిసబుల్ , ఆఫర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంతోనే కంపెనీ ఈ కొత్త స్కీంతో ఆఫర్ తీసుకొచ్చిందని స్పష్టం చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: