తెలుగు ఇండస్ట్రీలో సంక్రాంతి బరిలో పెద్ద సినిమాల హంగామాతో సాగిపోయింది. ప్రస్తుతం వచ్చే నెల వరకు పెద్దగా సినిమాల హంగామా లేదు..29 న మటుకు అడపా దడపా చిన్న సినిమాతో టాలీవుడ్ సందడి చేయనుంది. ఇక వేసవి పెద్ద సినిమా అంటే ఒక్కటే ఒక్కటి అదే పవన్ కళ్యాన్ నటించిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’. వాస్తవానికి సంక్రాంతి బరిలో రావాల్సి ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల వేసవి సెలవుల్లోకి వాయిదా పడింది. ప్రస్తుతం షూటింగ్ షరవేగంగా సాగుతుంది.

ఇప్పటికే హైదరాబాద్ షూటింగ్ ముగించుకొని గుజరాత్ కి షిఫ్ట్ అయ్యింది. ప్రస్తుతం 5 కోట్లు పెట్టి భారీ సెట్టింగ్ వేయించినట్లు సమాచారం. మొత్తానికి పవన్ కళ్యాన్ షూటింగ్ కోసం తన టైమ్ పూర్తిగా కేటాయిస్తున్నట్లు ఎట్టి పరిస్థితిలోనూ వేసవి సెలవుల్లో సినిమా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ గతంలో గబ్బర్ సింగ్ కంటే బీభత్సంగా ఉండబోతుందని వినికిడి. ఈ పాటకోసం దేవీశ్రీ ప్రత్యేక శ్రద్ద వహించినట్లు అందాల భామ రాయ్ లక్ష్మి పై ఇప్పటికే సాంగ్ కంప్లీట్ చేసినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.  గబ్బర్ సింగ్ షూటింగ్ లో రాయ్ లక్ష్మి బాగా ఎంజాయ్ చేస్తునట్లు కనపడుతోంది.

తాజాగా ఆమె తన ఫ్యాన్స్ కోసం సర్దార్ షూటింగ్ లోని ఓ ఫొటో ని ట్విట్టర్ ద్వారా అప్ లోడ్ చేసింది. ఆ ట్వీట్ ని ,ఫొటోని మీరు చూడండి. ఇక ఈ చిత్రంలో ఆమె ఐటం సాంగ్ , కొన్ని సీన్స్ చేయబోతోందని తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన ఓ పాట అదిరిపోనుందని, ఆ పాట పెద్ద హిట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి.పవన్‌కల్యాణ్‌తో కలిసి నటించడం ఇదే తొలిసారి. లక్ష్మీ రాయ్‌గా పరిచయమైన ఆమె కొంతకాలం క్రితమే తన పేరును రాయ్‌లక్ష్మిగా మార్చుకొంది. పవన్‌తో కలిసి నటించే సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని వ్యాఖ్యానించింది. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: రామ్‌ లక్ష్మణ్‌.


పవన్ కళ్యాన్, లక్ష్మీరాయ్


రాయ్ లక్ష్మీ ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: