కౌశల్ ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 చూసిన ప్రతి ఒక్కిరికీ తెలిసిన పేరు.  గత సంవవత్సరం బిగ్ బాస్ సీజన్ 1 తెలుగు లో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు.  బిగ్ బాస్ సీజన్ 1 లో శివబాలాజీ విజేతగా నిలిచారు. ఈ సంవత్సరం ఎన్టీఆర్ సినిమా షూటింగ్ బిజీలో ఉండటంతో..ఆయన ప్లేస్ లో నాని బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరించారు.  ఇక బిగ్ బాస్ సీజన్ 2 లో పదిహేడు మంది కంటిస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు.  ఇందులో కామన్ మాన్ గా గణేష్, సంజన, నూతన్ నాయుడులు ఉన్నారు. 


అయితే బిగ్ బాస్ సీజన్ 2 రెండవ వారం నుంచి హౌజ్ లో గొడవలు మొదలయ్యాయి. తనిష్, సామ్రాట్, తేజశ్వి ఒక జట్టుగా ఏర్పడి మరో కంటిస్టెంట్ అయిన కౌశల్ ని టార్గెట్ చేసుకొని రక రకాల ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు.  కౌశల్‌‌తో గొడవపడిన  కంటెస్టెంట్‌ తేజశ్వి ఎలిమినేట్ అయ్యారు. ఆపిల్ టాస్క్ లో భానుశ్రీ తో పాటు ఆమెను రెచ్చగొట్టే విధంగా ప్రేరేపించిన తేజస్వినికి మొదటి నుంచి కౌశల్ పడకుండా ఉంది.   


అయితే ఆపిల్ టాస్క్ లో కౌశల్ పై చేసిన ఆరోపణలో  గీతా మాధురి చొరవ తీసుకుని.. కౌశల్ తప్పుగా ప్రవర్తించలేదని తేల్చడంతో భానుశ్రీ , తేజశ్వి దిద్దుబాటుకి ప్రయత్నించారు. కానీ.. అప్పటికే వారిపై నెగటివ్‌ ఇంప్రెషన్‌ రావడంతో వరుసగా ఇద్దరినీ ప్రేక్షకులు తమ ఓట్ల ద్వారా ఇంటి నుంచి వెలుపలికి పంపించేశారు.  ఇక బయటకు వచ్చిన తర్వాత తేజశ్విపై ఎన్నో రకాలుగా నెగిటీవ్ కామెంట్స్ వినిపించాయి.  కౌశల్ ఆర్మి అయితే ఉతికి ఆరేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: