కొన్ని సార్లు ఉత్పేరకాలు ఎక్కువ మోతాదుల్లో తీసుకువడం వల్ల ఎన్నో అనార్థాలు జరుగుతుంటాయి.  తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్టెరాయిడ్ల డోసేజ్ పెరిగిపోవడంతో ఉన్మాదిలా మారిపోయాడు..తాను ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో అక్కడ ఉన్న వారిపై దాడి చేయడం.. పిచ్చిపట్టినవాడిలా తిరిగుతూ..నానా బీభత్సం సృష్టించాడు. తన చుట్టు పక్కల ఉన్న వారిపై విధ్వంసం సృష్టించాడు. మొరాదాబాద్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. గత కొంత కాలంగా ముంబైలో బౌన్సర్‌గా పనిచేసే అనాజ్ ఖురేషి పది రోజుల క్రితం తన సొంత ఊరు మొరాదాబాద్‌కు వచ్చాడు. గతంలో ఖురేషీ సల్మాన్ ఖాన్ వద్ద బాడీగార్డ్ గా పనిచేసినట్లు తెలుస్తుంది.  అక్కడ లోకల్ గా  జరిగిన మిస్టర్ మొరాదాబాద్ బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. 

అతనికి ఫస్ట్ రన్నర్‌అప్ టైటిల్ దక్కింది. తనకు బాడీబిల్డింగ్ టైటిల్ దక్కకపోవడంతో నిస్పృహకు గురైన ఖురేషి బుధవారం సాయంత్రం స్టెరాయిడ్లు ఓవర్‌డోస్ తీసుకుని జిమ్‌కు వెళ్లాడు. ఇప్పటి వరకు ఖురేషీ ఇలా ఉన్మాదిలా ఎప్పుడూ ప్రవర్తించలేదని..అతని సన్నిహితులు అంటున్నారు.  తన కుటుంబ సభ్యులతో సంతోషంగా ఎంజాయ్ చేయాలని వచ్చిన ఖురేషీ స్టెరాయిడ్ల డోసేజ్ పెరిగిపోవడంతో తానేం చేస్తున్నాడో విచక్షణా జ్ఞానం కోల్పోయి..మతిస్థిమితం కోల్పోయిన వాడిలా ప్రవర్తించడం అక్కడ ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు.

మొరాదాబాద్ బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లో అతనికి ఫస్ట్ రన్నర్‌అప్ టైటిల్ దక్కడంతో మానసికంగా కృంగిపోయారు.  జిమ్‌కు వ్యాయామం చేసిన తర్వాత ఇంటికి వచ్చి పడుకున్నాడు. తెల్లారి నిద్ర లేచింతర్వాత స్టెరాయిడ్ల దుష్ప్రభావం కారణంగా అతను విచక్షణను కోల్పోయాడు. పిచ్చిపట్టినవాడిలో చొక్కాలేకుండానే రోడ్డు మీదకు వచ్చి ఎదురుగా కనిపించిన కారును ఇనుప రాడ్డుతో ధ్వంసం చేయటం మొదలెట్టాడు. అంతేకాదు ఎదురు వచ్చిన వారిని చితకబాదాడు. దాంతో అక్కడి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని పట్టుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: