నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో 1998లో వచ్చిన తొలిప్రేమ సినిమా అప్పట్లో ఎంతో పెద్ద విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ముందుగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన పవన్ కళ్యాణ్, ఫస్ట్ సినిమాతో మంచి పేరు దక్కించుకున్నారు. ఆపై గోకులంలో సీత, అనంతరం సుస్వాగతం సినిమాల్లో నటించి యూత్ లో మంచి క్రేజ్ సంపాదించిన పవన్ ను ఆ సమయంలో కలిసిన దర్శకుడు కరుణాకరన్, తొలిప్రేమ కథ చెప్పడం, ఆ కథ ఎంతో నచ్చిన పవన్ వెంటనే దానిని మొదలెడదాం అని అనడం జరిగిందట. 

 

కీర్తి రెడ్డి తొలిసారిగా తెలుగు తెరకు పరిచయమైన ఆ సినిమాని ఎస్ ఎస్ సి ఆర్ట్స్ బ్యానర్ పై జివిజి రాజు నిర్మించడం జరిగింది. తక్కువ బడ్జెట్ తో నిర్మితం అయిన ఆ సినిమా భారీ విజయాన్ని, కలెక్షన్ ని అందుకోవడంతో పాటు జాతీయ ఉత్తమ తెలుగు ఫీచర్ ఫిలింగా అవార్డును గెలుచుకుంది. అలానే ఉత్తమ చిత్రంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభత్వ నంది అవార్డుని కూడా కైవశం చేసుకుంది. అయితే ఆ తరువాత పవన్ తో తన తదుపరి సినిమా చేయడానికి చాలా గ్యాప్ తీసుకున్న కరుణాకరన్, 2005లో ఆయన తో బాలు సినిమా తీశారు. అయితే ఆ సినిమా ఆశించిన రేంజ్ లో విజయాన్ని అందుకోలేకపోయింది. 

 

వాస్తవానికి తనకు పవన్ కళ్యాణ్ లైఫ్ ఇచ్చారని, తొలిప్రేమ సినిమాతో ఏకంగా ఒక్కసారిగా తన సినిమా కెరీర్ మొత్తం మారిపోయిందని, అలానే మొదటి నుండి పవన్ తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, తనకు లైఫ్ నిచ్చిన పవన్ ని ఎప్పటికీ మరిచిపోలేనని ఇప్పటికీ పలు ఇంటర్వ్యూ ల్లో చెప్తుంటారు కరుణాకరన్. ఇక పవన్ తో పని చేయడం ఒక గొప్ప అనుభవం అని, సెట్ లో అందరితో ఎంతో సరదాగా వ్యవహరించే పవన్, డైరెక్టర్లు, నిర్మాతలకు ఎంతో గౌరవం ఇస్తారని, అలానే ఆయనతో ఒక్కసారి పనిచేస్తే మళ్ళి మళ్ళి ఆయనతోనే పని చేయాలని అనిపిస్తుందని, అటువంటి ఒక మ్యాజిక్ పవన్ లో ఉందని కరుణాకరన్ చెప్పడం జరిగింది.....!!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: