ఇండియన్ సినిమా లెజెండ్స్ లో ఒకరైన బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా భారతీయ సినిమా ముఖచిత్రంగా మారిపోయారు. ఇప్పటికీ యాక్టివ్ గా సినిమాలు చేస్తున్ అమితాబ్ ఎందరికలో ఆదర్శంగా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు బచ్చన్ సాబ్. నేడు తన పెళ్లిరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆ మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. తన పెళ్లి ఫోటోలను షేర్ చేసి ఆ సందర్భంగా జరిగిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు.

IHG

 

‘సరిగ్గా 47ఏళ్ల క్రితం జూన్ 3న జయ బాదురిని పెళ్లి చేసుకున్నాను. ఆ సమయంలో మేమిద్దరం కలిసి నటించిన జంజీర్ విడుదల అయింది. ఈ సినిమా హిట్ అయితే కొంతమంది స్నేహితులతో కలిసి తొలిసారి లండన్ వెళ్లాలని అనుకున్నాను. ఎవరెవరు లండన్ వెళ్తున్నారు అని నాన్నగారు ప్రశ్నించారు. కొంతమంది స్నేహితులతో కలిసి వెళ్తున్నాను అని ఆమె పేరు కూడా చెప్పాను. అందుకు ఆయన.. ముందు నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. ఆ తర్వాత లండన్ వెళ్లు.. లేదంటే వెళ్లేందుకు వీల్లేదు అన్నారు. నేను ఆయన మాట దాటలేదు. 47 క్రితం ఇదే రోజున జయను పెళ్లి చేసుకున్నాను’ అని తన పెళ్లినాటి ముచ్చట్లు చెప్పుకొచ్చారు.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=LOVE STORY' target='_blank' title='love story-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>love story</a> through rare ...

 

ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమితాబ్ తన ప్రేమ, పెళ్లి జ్ఞపకాల్ని చెప్పడం విశేషం. అమితాబ్ ప్రేమకథలోని ఈ చిన్న విషయం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ అమితాబ్ కు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. అమితాబ్ – జయ బాధురి ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జయా బచ్చన్ పెద్దగా సినిమాలు చేయకపోయినా అమితాబ్ మాత్రం రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నారు.   

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

47 years .. today .. june 3, 1973 .. !! Had decided if Zanjeer would succeed, we would along with a few friends go to london for the first time .. My father asked who you going with ? When i told him who , he said you must marry her before you go .. else you don’t go .. So .. I obeyed .. !!

A post shared by amitabh Bachchan (@amitabhbachchan) on

మరింత సమాచారం తెలుసుకోండి: