ప్రభాస్ హీరో గా మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా బిల్లా. ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. ఈ సినిమా ట్రైలర్ ని చూసి సినిమా చూడటానికి వెళ్ళిన చాలా మంది సినిమాను చూడలేక వెనక్కు తిరిగి వచ్చారు అనే చెప్పాలి. ఈ సినిమా అప్పట్లో ఎన్నో అంచనాలతో వచ్చింది. ఈ సినిమా మీద ప్రభాస్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు అనే చెప్పాలి. సినిమా కథ ఏ విధంగా ఉన్నా సరే అందులో ప్రభాస్ ని చూపించిన విధానం మాత్రం జనాలను బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. ఇక ప్రభాస్ తో పాటుగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనుష్క కూడా చాలా బాగా ఆకట్టుకుంది. 

 

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా పెద్ద స్క్రీన్ మీద అంతగా విజయం సాధించలేదు గాని చిన్న స్క్రీన్ మీద మాత్రం చాలా పెద్ద హిట్ అయింది అని చెప్పాలి. అవును ఈ సినిమా చిన్న స్క్రీన్ మీద చాలా మంది ఇప్పుడు టీవీ లో వచ్చినా సరే కచ్చితంగా మిస్ అవకుండా చూస్తూ ఉంటారు. ఈ సినిమాలో ప్రభాస్ నటన ఒక సంచలనం. అతను కొన్ని కొన్ని కోణాలు చూపించాడు ఈ సినిమాలో. అందుకే ఈ సినిమా ఆ విధంగా టీవీ లో ఆడింది. అయితే ఎప్పటికప్పుడు యాక్షన్ ని కోరుకునే తెలుగు సినిమాకు సినిమా కథ అంతగా అర్ధం కాలేదు అనే చెప్పాలి. 

 

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ కూడా ఆలోచించి సినిమాలు చేయడం మొదలు పెట్టారు. అగ్ర దర్శకుల కథలు అయినా సరే ఒకటికి పది సార్లు ఆలోచన చేసి ప్రభాస్ సినిమాలను ఓకే చేస్తున్నాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ప్రభాస్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు లాక్ డౌన్ లో ఆగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: