సుదీప్ నటన,రెండవ అర్ధభాగంలో కొన్ని సన్నివేశాలు సుదీప్ నటన,రెండవ అర్ధభాగంలో కొన్ని సన్నివేశాలు పట్టు లేని కథనం, అవసరం లేని పాటలు, సాగదీసిన సన్నివేశాలు

ఒక పోలీస్ అధికారి (ఆశిష్ విద్యార్థి) మరియు ఒక డాక్టర్(నాజర్) ని హత్య చేస్తాడు భరత్ (సుదీప్) , అలా హత్య చేసి పారిపోతుండగా పోలీస్ లకి దొరికిపోతాడు. విచారణ అధికారిగా భరత్ ముందుకు వస్తాడు విజయ్ కుమార్( జగపతి బాబు). అసలు వీరిద్దర్నీ భరత్ ఎందుకు హత్య చేసాడని ప్రశ్నించగా అతను తన కథ చెప్పడం మొదలు పెడతాడు. భరత్ , రియల్ ఎస్టేట్ ని కార్పొరేట్ స్థాయిలో చేస్తున్న వ్యాపారవేత్త. అందులోనే ఒక స్థలం విషయంలో అతనికి మరియు రవి శంకర్ కి మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. అదే సమయంలో ఒక పోలీస్ అధికారి మరియు డాక్టర్ మూలాన అతని జీవితం గందరగోళం గా తయారవుతుంది. కాని ఇంటర్వెల్ తరువాత కథ మొత్తం మారిపోతుంది, అసలు భరత్ మరియు అంజలి ప్రేమ కథ ఏంటి? వీరి మధ్యలో అశ్విని ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే చిత్రం చూడాల్సిందే..

అభినయ చక్రవర్తి సుదీప్ చాలా అద్భుతంగా నటించారు, చిత్రం మొత్తాన్ని తన భుజం మీద వేసుకొని నడిచారు. అక్కడక్కడా చిత్ర వేగం తగ్గకుండా ఉండటానికి ప్రధాన కారణం ఈయన ప్రదర్శనే అని చెప్పుకోవచ్చు. జగపతి బాబు పాత్ర చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు అందులోనూ వేరొకరితో డబ్బింగ్ చెప్పించడం అతనికి బొత్తిగా నప్పలేదు. పరుల్ యాదవ్ ఉన్నంతలో బాగానే నటించింది. తెర మీద తులిప్ జోషి తన అందాలతో కట్టిపడేసింది. భావన చిన్న పాత్రనే అయినా చాలా బాగా నటించింది. నాజర్ మరియు ఆశిష్ విద్యార్థి తమ పాత్రలతో ఆసక్తి సృష్టించగలిగారు. ప్రదీప్ రావత్ మరియు రవి శంకర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.

బచ్చన్ చిత్రంలో చాలా చిన్న కథ ఉంది , ఇప్పటికే చాలాసార్లు చూసిన కథ ఇది, మొదటి అర్ధ భాగం అంతంతమాత్రం గానే ఉన్నా రెండవ అర్ధ భాగం కాస్త ఆసక్తిని పెంచింది. సుదీప్ పాత్రను ఒక మానసిక రోగిగా చూపించడం ఆసక్తికరంగానే ఉన్నా , ఆ సన్నివేశాలలో వచ్చే సంభాషణలు దారుణంగా ఉన్నాయి. బాగా సాగదీసిన మొదటి అర్ధ భాగం చూశాక రెండవ అర్ధ భాగం మీద ఆశలు నీరు గారిపోతాయి, అందులోనూ రెండవ అర్ధభాగంలో చూపించిన ప్రతీకార కథ అబ్బే ఆకట్టుకోలేదు, ఊరికేనే వచ్చిపోయే పాత్రలు ఎందుకో ఎవరికీ అర్ధం కాదు. రెండవ అర్ధ భాగం మొదలవ్వగానే క్లైమాక్స్ అర్ధం అయిపోవడంతో టైటిల్ కార్డు ఇంక లాంచనం అయిపోతుంది. ఈ చిత్రాన్ని చాలా వరకు కత్తిరించి ఉండవచ్చు ఈ సన్నివేశాల వద్ద ఎడిటర్ ఎం చేస్తున్నాడు అన్న సందేహం కచ్చితంగా వస్తుంది. సంగీతం పరవాలేదు నేపధ్య సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. ఈ చిత్రానికి శేకర్ చంద్ర అందించిన సినిమాటోగ్రఫీ చాలా తోడ్పడింది. నిర్మాణ విలువలు చాలా నాసిరకంగా ఉంది.

ఈ చిత్రం ఎందుకు అనువదించారు? మొదటి ప్రశ్న ఇంతలో ఎవరో అన్నారు కన్నడ లో ఈ చిత్రం పెద్ద హిట్, మరి ఇక్కడ ఎందుకు ఇలా ఉంది, ఒక్కటే కారణం డబ్బింగ్ బాగోలేకపోవడం.... అవును డబ్బింగ్ సరిగ్గా చెయ్యకపోతే ఎంత మంచి చిత్రం అయినా నాశనం అయిపోద్ది అనడానికి ఈ చిత్రం ఒక ఉదాహరణ మాత్రమే అంతే కాకుండా అనువాద కార్యక్రమాలలో కూడా నాసిరకమయిన ఫలితం కనిపిస్తుండటం ప్రేక్షకుడిని చిరాకు పెట్టె విషయం. కన్నడలో బాగున్న డైలాగ్స్ తెలుగు లోకి వచ్చేసరికి చాలా ఘోరంగా తయారయ్యాయి. జగపతి బాబు అంటే ఆయన గాత్రం , అలాంటిది వేరొకరితో అతనికి డబ్బింగ్ చెప్పించడంతో ఆ పాత్ర పూర్తిగా నాశనం అయిపోయింది. రొటీన్ కథని కాస్త ఇంటరెస్టింగ్ గా చెప్తున్నా కూడా ఆ డబ్బింగ్ మరియు గ్రాఫిక్స్ ఈ చిత్రాన్ని పూర్తిగా చంపేసింది.. ఈ చిత్రాన్ని చూడాలా వద్దా అన్న ఆలోచన వద్దు ఒకవేళ మీరు సుదీప్ ఫాన్స్ అయితే ఇదే చిత్రాన్ని కన్నడలో చూడండి...

Sudeep,Jagapati Babu,Bhavana,Shashank.బచ్చన్ : డబ్బింగ్ వల్ల ప్రేక్షకుడు చచ్చేన్ ...

మరింత సమాచారం తెలుసుకోండి: