అక్టోబర్ 1వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ ఆహా లో విడుదలైన ఒరేయ్ బుజ్జిగా సినిమా లో మాళవిక నాయర్ కనబరిచిన నటనా చాతుర్యానికి తెలుగు ప్రేక్షకులందరూ ఫిదా అయ్యారు అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా అంతగా ప్రేక్షక ఆదరణ పొందే లేకపోయినా మాళవిక నాయర్ పాత్ర మాత్రం హైలెట్ అయ్యింది అని చెప్పుకోవచ్చు. గతంలో ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, కళ్యాణ వైభోగమే వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్న మాళవిక నాయర్ ఇప్పటి వరకు చాలా డీసెంట్ పాత్రల్లోనే నటించారు.


స్కిన్ షో చేసే పాత్రలో ఆమె ఇంతవరకు కనిపించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఆమె గ్లామర్ పాత్రల్లో నటించేందుకు సై అంటున్నారు. అలాగే కరోనా వైరస్ కారణంగా సినిమా పరిశ్రమలు పరిస్థితులు మారిపోయాయని.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లు విపరీతంగా రూపొందుతున్నాయని.. ప్రేక్షకుల అభిరుచి కూడా పూర్తిగా మారిపోయిందని.. ప్రేక్షకుల టేస్ట్ కి తగ్గట్టుగా సినిమా నటీనటులు కూడా మారాల్సిందేనని చెప్పుకొచ్చిన మాళవిక నాయర్ తనకు గ్లామరస్ పాత్రలో నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు.


సినిమా థియేటర్లు ఓపెన్ అయినా కూడా ఓ టి టి  ప్లాట్ ఫామ్ లలో విడుదలయ్యే వెబ్ సిరీస్ లకు, సినిమాలకు పాపులారిటీ తగ్గకపోవచ్చు అని ఆమె అభిప్రాయపడ్డారు. ఓటీటీ సంస్థలు తెరకెక్కించే కంటెంట్ బేస్డ్ సినిమాల్లో గాని సీరియళ్ళలో గాని నటించడానికి తాను సిద్ధం అని మాళవికా నాయర్ చెప్పుకొచ్చారు. ఇకపోతే రాజ్ తరుణ్ హీరో గా నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమాలో నటించి మెప్పించిన మాళవిక నాయర్.. అతనితో కలిసి మళ్ళీ ఇంకొక సినిమా లో చేయబోతున్నారని సమాచారం. ఏదేమైనా మాళవిక నాయర్. ఎటువంటి గ్లామరస్ పాత్రల లో నటించబోతున్నారో చూడాలిక.

మరింత సమాచారం తెలుసుకోండి: