టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి వకీల్ సాబ్ కాగా మరొకటి
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ సినిమా. కాగా వకీల్ సాబ్ సినిమాని
దిల్ రాజు,
బోనీకపూర్ నిర్మిస్తుండగా
క్రిష్ సినిమాని మెగా
సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ
తమిళ నిర్మాత ఏఎం రత్నం ఎంతో భారీ లెవల్లో నిర్మిస్తున్నారు. ఇక వకీల్ సాబ్ ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకోవడంతో పాటు దానికి సంబంధించి ఇటీవల మగువా మగువా అనే పల్లవితో సాగే లిరికల్ సాంగ్ అలానే ఫస్ట్ లుక్ మోషన్
పోస్టర్ రెండూ కూడా
యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రేక్షకాభిమానుల నుండి మంచి స్పందన రాబట్టి సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.

అతి త్వరలో షూటింగ్ పూర్తి కానున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న
సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. దీనిని వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేసేలా
మూవీ యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక పోతే ఈ రెండు సినిమాల అనంతరం
హరీష్ శంకర్ తో ఒక
సినిమా సురేందర్ రెడ్డి తో మరో
సినిమా తో పాటు
యువ దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో అయ్యప్పన్ కోషియం తెలుగు రీమేక్లో కూడా
పవన్ నటించనున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అతి త్వరలో
పవర్ స్టార్ తో
సినిమా చేయనున్న
హరీష్ శంకర్ అలానే సాగర్ చంద్ర ఇద్దరూ కూడా
పవర్ స్టార్ కి వీరాభిమానులు కావడమే.

గతంలో
గబ్బర్ సింగ్ సినిమాతో
పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యద్భుతమైన
మాస్ కమర్షియల్ సినిమాని తెరకెక్కించి
బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న
హరీష్ శంకర్ తదుపరి చేసే చేయబోయే సినిమాకి సంబంధించి కూడా ఒక పవర్ఫుల్ స్టోరీని రాసుకున్నారని,
పవన్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాని మైత్రి
మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించనుందని అంటున్నారు. మరోవైపు అయ్యప్పన్ కోషియం తెలుగు
రీమేక్ కథని మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా అలానే
పవర్ స్టార్ ఫ్యాన్స్ కి నచ్చే విధంగా దర్శకుడు సాగర్ చంద్ర కొంత మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా
పవన్ కు వీరాభిమాని అయిన తాను ఆయనని ఏ విధంగా చూపిస్తే అభిమానులు థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారో అటువంటి అంశాలన్నీ కూడా ఈ సినిమాలో పొందుపరుస్తున్నాడట. మొత్తంగా చూసుకుంటే ఇద్దరు వీరాభిమానులు దర్శకత్వంలో
పవన్ నుండి రాబోతున్న ఈ రెండు సినిమాలు ఆయన అభిమానులకు అతి పెద్ద విందు భోజనం అని అంటున్నారు పలువురు విశ్లేషకులు.....!!