ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... యూత్ స్టార్ నితిన్ "భీష్మ" సినిమా హిట్ తరువాత చేసిన సినిమా "చెక్". రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. తెలుగు ఇండస్ట్రీ దర్శకులలో వైవిధ్యభరితమైన చిత్రాలు తెరకెక్కించడంలో సిద్ధ హస్తుడైనా చంద్రశేఖర్ ఏలేటి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా నేడు (ఫిబ్రవరి 26) విడుదలైంది. ఏలేటి మార్క్ ఎంటర్ టైన్మెంట్ ను 'చెక్' అందించిందా? 'భీష్మ'తో బ్లాక్ బస్టర్ అందుకున్న నితిన్ కెరీర్ కు ఈ సినిమా ఎంతవరకు హెల్ప్ అయ్యింది? భవ్య ఆనంద్ ప్రసాద్ కు ఎట్టకేలకు హిట్ దొరికిందా లేదా? అనేది ఇప్పుడు తెలుసుకోండి...


ఇక ముందుగా నటీ నటుల యాక్టింగ్ విషయానికి వస్తే ఈ సినిమాలో నితిన్ ఖైదీగా నటించాడు.అయితే.. ఒక ఉరి శిక్ష ఖైధీలో ఉండే ఇంటెన్సిటీ మాత్రం నితిన్ కళ్ళల్లో కనిపించలేదు.అది కొంచెం ఖైదీగా కాకుండా సాధారణ యాక్టర్ ల నటించాడు.రకుల్ సహాయ పాత్ర పోషించింది. లాయర్ గా ఆమె నటన సోసోగానే ఉంది. ప్రియా ప్రకాష్ వారియర్ ఒక పాట, రెండు సీన్లకు పరిమితమైపోయింది. ఫిదా, సైరా తర్వాత సాయిచంద్ కి మళ్ళీ మంచి రోల్ వచ్చింది. సంపత్, మురళీశర్మ, కృష్ణతేజ, హర్షవర్ధన్ తమ పాత్రలకు న్యాయం చేశారు.పాటలు, నేపథ్య సంగీతం కూడా పెద్ద ఆకట్టుకోలేదట...


ఇక సినిమా ఎలా ఉందంటే...ఆయన రాసుకున్న కథలో మొదటిసారి కొత్తదనం లోపించింది, కథనం చాలా సాదాసీదాగా సాగింది. కథలో అతిముఖ్యమైన ట్విస్టులను ఆడియన్స్ ముందే పసిగట్టేస్తారు. ఒక థ్రిల్లర్ సినిమాకు ఇలాంటివన్నీ మైనస్ పాయింట్స్ అనే చెప్పాలి. ఇక సినిమా చూసిన ఆడియన్స్ అంతగా ఆకట్టుకోలేదని స్పందింస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లి చూస్తే ఓ మోస్తారుగా నచ్చుతుంది. కాని చంద్రశేఖర్ ఏలేటి సినిమా అని ఏదో ఉంటుందని ఆశించి పోతే నిరాశ తప్పదట...నిజానికి చంద్రశేఖర్ ఏలేటి సినిమాలు హిట్ అయినా కాకపోయినా క్రెటిక్స్ ని అలాగే జనాలని ఎంతో ఆలోచింపజేసి ఎంతగానో ఆకట్టుకుంటాయి...కాని ఈ సినిమా నిజంగా చెప్పాలంటే నితిన్ కంటే కూడా చంద్రశేఖర్ ఏలేటి కే పెద్ద ఎఫెక్ట్ అవుతుందట. నిజానికి చంద్రశేఖర్ ఏలేటి సినిమా అంటే ప్రేక్షకులు కొత్తదనం, వైవిధ్యం కోరుకుంటారు. కాని ఈ సినిమా చాలా బోరింగ్ గా సోసోగా ఉందట.. అసలు ఏలేటి 2007లో తీసిన 'ఒక్కడున్నాడు' కాన్సెప్ట్ తో హాలీవుడ్ లో 2010లో సినిమా వచ్చింది అంటే తెలుగు ప్రేక్షకులు ఇప్పకటికి గర్వపడతారు.అలాంటి సినిమాలని తెరాకెక్కించిన ఈయన ఇలాంటి సినిమా తీయడం ఏంటని ఆడియన్స్ నుంచి ఇండియా హెరాల్డ్ కి సమాచారం అందుతుంది.. మొత్తానికి ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేకపోయిందట....

మరింత సమాచారం తెలుసుకోండి: