తెలుగు చిత్ర పరిశ్రమలో సింగర్ మను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన పాటలతో మెప్పిస్తూ కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తెలుగు, తమిళం, కన్నడతో సహా దాదాపు 10 భాషల్లో ఈయన పాటలు పాడాడు. నటుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు డబ్బింగ్ ఆర్టిస్టుగానూ మనో అందరికీ పరిచయం. ముఖ్యంగా రజినీకాంత్‌కు తనదైన శైలిలో అదిరిపోయే డబ్బింగ్ చెప్తుంటాడు మనో. ఇక ఇప్పుడు ఈటీవీలో ప్రసరమైయ్యే జబర్డస్త్ షోకి న్యాయనిర్ణేతగా వస్తున్నారు. అంతటి గుర్తింపు తెచ్చుకున్న ఈయనకు ఆస్తులు కూడా అలాగే ఉన్నాయి.

అయితే మనో ఈ స్థాయికి రావడానికి చాలానే కష్టపడ్డాడు. ఒకప్పుడు కనీసం ఒక పూట భోజనం కూడా లేని స్థాయి నుంచి ఈ రోజు అనుభవిస్తున్న ఐశ్వర్యానికి చేరుకోడానికి ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాడు మనో. కడుపు కాలి డబ్బుల్లేక ఖాళీ కడుపుతో పడుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాడు మనో. అప్పుడు దిగ్గజ సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర అసిస్టెంట్‌గా పని చేసాడు.. అలా సంగీతంపై పూర్తిగా పట్టు సాధించాడు. అనుకోకుండా ఇళయరాజా పుణ్యమా అని గాయకుడు అయ్యాడు.

ఇక ఎంతోమంది అగ్ర సంగీత దర్శకులతో పాటలు పాడాడు మనో. ఆయన కష్టానికి తగ్గ ఫలితమే ఇప్పుడు ఆయన్ని వందల కోట్లకు అధిపతిని చేసింది అంటారు సన్నిహితులు. నిజానికి గాయకులకు సంపాదన పెద్దగా ఏం ఉండదు.. ఉన్నా కోట్లలో మాత్రం ఉండదు. కానీ మనో మాత్రం పక్కా ప్లానింగ్‌తో తన సంపాదనను పెంచుకున్నాడు. అప్పట్లో వచ్చిన డబ్బుతో ఫ్లాట్స్ కొన్నాడు మనో. ఎక్కువగా వాటిపైనే ఇన్వెస్ట్ చేసాడు. అలా ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు మనో.

అంతేకాక వాటితో పాటు దేశవిదేశాల్లో ఎన్నో వేల కార్యక్రమాలు ఇచ్చాడు మనో. ఈయనకు ఇద్దరు కొడుకులు.. ఒక కూతురు ఉన్నారు.పెద్దబ్బాయి షకీర్ తమిళ్ సినిమాల్లో నటుడిగా నిలదొక్కుకుంటుండగా.. చిన్న కొడుకు రతేష్ కూడా నటుడిగా బిజీ అవ్వాలని చూస్తున్నాడు. మరోవైపు చిన్నారి కూతురు సోఫియా తండ్రి బాటలోనే గాయనిగా మారుతుంది. స్వరాభిషేకంలో ఇప్పటికే ఈమె పాటలు కూడా పాడుతుంది. ముస్లిం అయిన మనో.. అన్ని మతాలను గౌరవిస్తాడు.. అందరు దేవుళ్లను పూజిస్తుంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: