‘బాహుబలి’ విడుదల తరువాత ఏ సినిమా అయినా విడుదల అయి నిలదొక్కుకోవాలి అంటే కనీసం మూడు నాలుగు వారాలు గ్యాప్ కావాలి అని మహేష్ బాబు లాంటి టాప్ హీరోలు అభిప్రాయ పడుతుంటే ఎటువంటి భయం లేకుండా అల్లరి నరేష్ ‘బాహుబలి’ సునామీ మధ్య ప్రేక్షకుల ముందుకు రావడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

ఈరోజు అల్లరోడి పుట్టినరోజు సందర్భంగా అల్లరి నరేశ్ నటిస్తున్న ‘జేమ్స్ బాండ్’ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా జూన్ నెలాఖరకు విడుదల చేస్తారు అని అందరూ అనుకుంటే చిన్న సినిమాల మధ్య పోటీ ఎందుకని ఆ రేసు నుండి తప్పుకుని ఏకంగా ‘బాహుబలి’ విడుదలైన కేవలం వారం రోజుల గ్యాప్ లో జూలై 17న విడుదల కాబోతూ ఉండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

‘బాహుబలి’ జూలై 10న విడుదల అయిన తరువాత మరో రెండు వారాల వరకు చిన్న సినిమాలు అయినా  విడుదల కావు అన్న  ఊహాలను తారుమారు చేస్తూ కేవలం వారం రోజుల గ్యాప్ తో తన నవ్వులతో ‘బాహుబలి’ కి ఎటాక్ ఇవ్వడం అల్లరి నరేష్ చేస్తున్న సాహసం అని అంటున్నారు.  ‘బాహుబలి’ విడుదల తరువాత మరో రెండు వారాలపాటు ఇరు రాష్ట్రాలలోను ధియేటర్లు దొరకడం కష్టం అన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో అల్లరి నరేష్ ‘జేమ్స్ బాండ్’ సినిమాకు దియేటర్స్ దొరుకుతాయా? అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఇలాంటివి ఏమీ సంబంధం  లేదు అంటూ అల్లరోడి దూకుడుకు 49వ సినిమాగా ‘జేమ్స్ బాండ్’ విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. సాయి కిషోర్ దర్శకత్వంలో అనీల్ సుంకర నిర్మించిన ఈ సినిమాలో సాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. వరస పెట్టి వస్తున్న పరాజయాల మధ్య ‘బాహుబలి’ సునామీతో పోటీ పడుతూ శ్రీమంతుడు చేయలేని సాహసం అల్లరోడి ‘జేమ్స్ బాండ్’ చేస్తున్న సాహసానికి సక్సస్ వస్తే అది మరొక సరికొత్త రికార్డు అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: