బుల్లితెరపై యాంకర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి మాటలతో ప్రేక్షుకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక మూడు పది ఏళ్ళు దాటినా పెళ్లి చేసుకొని బుల్లితెర నటులు కొంత మంది ఉన్నారు. వాళ్ళు ఎవ్వరో ఒక్కసారి చూద్దామా. బుల్లితెర పై ప్రముఖ మేల్ యాంకర్ గా కొనసాగుతున్న ప్రదీప్ వయసు ఇప్పటికే 34 సంవత్సరాలు. ఒకవైపు పలు కార్యక్రమాలకు యాంకర్ గా విధులు నిర్వహిస్తూ ఉండటమే కాకుండా మరోవైపు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న ప్రదీప్ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.

ఇక బుల్లితెరపై ఎంతో బిజీగా గడుపుతున్న ఆర్టిస్టులలో సుడిగాలి సుదీర్ ఒకరు. జబర్దస్త్ వంటి కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ వయసు 33 సంవత్సరాలు అయినా పెళ్లి చేసుకోలేదు. జబర్దస్త్ షో ద్వారా ఫుల్ ఫాలోయింగ్ పెంచుకున్న హైపర్ ఆది వయస్సు 31 సంవత్సరాలు.వరుసగా టీవీ కార్యక్రమాలు,సినిమాలను చేస్తూ బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న హైపర్ ఆది పెళ్లి విషయం గురించి మర్చిపోయాడు.

బుల్లితెరపై స్టార్ యాంకర్లలో ఒకరైన రష్మి గౌతమ్ వయసెంతో ఎవరికీ కరెక్ట్ గా తెలియదు. గూగుల్ ప్రకారం ఈమె వయసు 32 సంవత్సరాలు అయినప్పటికీ పెళ్లి ప్రస్తావన లేకుండా బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. విష్ణు ప్రియ కూడా బుల్లితెరపై యాంకరింగ్ విధులు నిర్వహిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈమెకు 33 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ పెళ్లి ప్రస్తావన లేకుండా, పలు కార్యక్రమాలను చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

బిగ్ బాస్ 3 విన్నర్ గా టైటిల్ గెలిచిన రాహుల్31 సంవత్సరాలు వచ్చినప్పటికీ పెళ్లి గురించి ఆలోచించకుండా మ్యూజిక్ ఆల్బమ్స్ చేసుకుంటూ, సినిమా పాటలు పాడుతూ లైఫ్ ఎంతో ఎంజాయ్ చేస్తున్నాడు. బిగ్ బాస్ ఫోర్ ద్వారా పరిచయమైన మోనాల్ వయసు 30 సంవత్సరాలు అయినప్పటికీ పెళ్లి గురించి ఆలోచించకుండా పలు టీవీ కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.

బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ గా పాల్గొని, పలు టీవీ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్న భాను శ్రీ రెడ్డి వయసు 30 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. పలు టీవీ సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్న రవికృష్ణ వయసు 30 ఏళ్లు దాటినా కూడా పెళ్లి చేసుకోకుండా వరుస టీవీ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ గా పాల్గొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రోహిణి వయసు 30 ఏళ్లు దాటిన పెళ్లి గురించి ఆలోచించకుండా పలు టీవీ కార్యక్రమాలను చేస్తూ బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: