ఈశ్వర్ సినిమాతో హీరోగా తన కెరీర్ స్టార్ట్ చేసి దానితో మంచి విజయాన్ని అందుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ అక్కడి నుండి వరుసగా హీరోగా పలు సినిమాలు చేస్తూ కొనసాగారు. అనంతరం ఆయన హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన లవ్ కమ్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా మూవీ డార్లింగ్. కరుణాకరన్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో తమిళ నటుడు ప్రభు, ప్రభాస్ కి తండ్రిగా నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది
మొదటి నుంచి కూడా హృద్యమైన రీతిలో లవ్ స్టోరీలను తనదైన శైలిలో అద్భుతంగా తెరకెక్కించి ఆడియన్స్ లో తనకంటూ మంచి పేరు సంపాదించుచుకున్న కరుణాకరన్ ఈ సినిమాను కూడా అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఎంతో గొప్పగా తెరకెక్కించి వారి నుంచి మరింతగా క్రేజ్ దక్కించుకున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్, కాజల్ ఆ జోడి కి ఆడియన్స్ నుండి మంచి పేరు లభించింది.  ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత హీరోగా ప్రభాస్ కి మరింత పేరు, గుర్తింపు రావడంతో పాటు ఆయన మార్కెట్ స్థాయి కూడా బాగా పెరిగింది.

కాగా ఈ సినిమా నేటితో సక్సెస్ ఫుల్ గా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు ప్రభాస్ అభిమానులు డార్లింగ్ మూవీ యూనిట్ కి అలానే ప్రత్యేకంగా తమ అభిమాన హీరో ప్రభాస్, హీరోయిన్ కాజల్ లతోపాటు మిగతా నటీనటులు అందరికీ కూడా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు. అలానే పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా డార్లింగ్ పేరుతో ట్రెండ్ కూడా సెట్ చేసి ప్రభాస్ అభిమానులు దీన్ని మరింత వైరల్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: