కమల్ హాసన్ కూతురు గా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈనాడు తండ్రి టాగ్ ని వాడుకోలేదు శృతి.. వచ్చిన ప్రతి చిన్న ఆఫర్ ని కాదనకుండా చేసి ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది.. తెలుగులో ఆమె ఇప్పుడు టాప్ హీరోయిన్ గా ఎదిగింది.. వాస్తవానికి ఆమెకు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పాలి.. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆమెకు ఒకటి రెండు సినిమాలు తప్పా ఏదీ పెద్దగా కలిసి రాలేదు.. సెకండ్ ఇన్నింగ్స్ లో శృతిహాసన్ మామూలు జోరు లో లేదు..

క్రాక్ సినిమా హిట్ అవడంతో ఆమెకు వరుస సినిమాలో అవకాశాలు వచ్చి పడుతున్నాయి.. ఇప్పటికే ప్రభాస్ ప్రశాంత్ నీల్ ల కాంబినేషన్ లో వస్తున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది శృతి హాసన్.. ఈ సినిమాలో శృతి హాసన్ పవర్ఫుల్ జర్నలిస్ట్ పాత్రలో నటించబోతోంది అని వార్తలు వస్తున్నాయి.. దాదాపు మూడేళ్ల తర్వాత ఆమెకు క్రాక్ సినిమాతో హిట్టు రాగా, ఇటీవల వచ్చిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లోనూ చిన్న పాత్రలో కనిపించి ఆ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది..

అలాగే టాలీవుడ్ నుంచి మరికొన్ని సినిమాల అవకాశాలు కూడా వస్తున్నాయి.. అయితే ఆమె పర్సనల్ విషయాలకొస్తే ముప్పైయేళ్లు దాటినా ఆమెకు పెళ్లిపై ధ్యాస ఉండట్లేదు.. ఇప్పటికే ఓ బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్ అప్ అయిపొయింది శృతి హాసన్.. ప్రస్తుతం ఓ కొత్త బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. పెళ్లి దాకా వచ్చి ఆగిపోయిన ఆమె పెళ్లి ఈసారైనా కొత్త బాయ్ ఫ్రెండ్ తో జరుగుతుందా అని ఆమె అభిమానులు అడుగుతున్నారు.. ఏదేమైనా శృతి హాసన్ సినిమాలు, వ్యక్తిగత జీవితం రెండు బాగా ఉండాలని కోరుకుంటున్నారు ఆమె అభిమానులు.. మరి అభిమానుల మొర ఆమె ఆలకిస్తుందా చూడాలి.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండే శృతిహాసన్ మంచి మంచి ఫొటోలతో పాటు వారితో లైవ్ సెషన్స్ లో కూడా పాల్గొంటుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: