శృతిహాస‌న్ కు ఉన్న క్రేజ్ గురించిప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. క‌మ‌ల్‌హాస‌న్ కూతురిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంది. త‌న అందం, అభిన‌యం, గ్లామ‌ర్ తో కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఇక తెలుగు, త‌మిల‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. వ‌ర‌స పెట్టి సినిమాలు చేస్తోంది.

ఇక ఇప్పుడు మ‌రో రికార్డు క్రియేట్ చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నెట్ వర్క్ గ్రూప్ కు చెందిన 'హైదరాబాద్ టైమ్స్' విభాగం ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాను ప్ర‌క‌టించింది. దీంట్లో 2020 సంవత్సరానికి గాను 30 మంది ముద్దుగుమ్మలతో ఈ లిస్టును విడుద‌ల చేసింది. దీంట్లో టాప్-10 సెలబ్రిటీలు వీళ్లే.

ఇక మోస్ట్ డిజైరబుల్ ఉమెన్' టైటిల్ ను నెం.1 ప్లేతో ఎగ‌రేసుకుపోయింది శృతిహాసన్. అంత‌కు ముందు 2013లో తొలిసారి ఈ టైటిల్ ను గెలుచుకొన్న శృతి.. ఆ త‌ర్వాత దాన్ని ద‌క్కించుకోలేక‌పోయింది. చాలా ఏళ్ల త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ ఆ టైటిల్‌ను ద‌క్కించుకుంది. ముప్పై ఏళ్లు దాటిన‌ప్ప‌టికీ త‌న అందంతో కుర్ర‌కారు మ‌తుల‌ను పోగొడుతూనే ఉంది ఈ పిల్ల‌. ఇటీవల 'క్రాక్' 'వకీల్ సాబ్' సినిమాలతో మంచి హిట్ కొట్టింది.

 
ఇక అక్కినేని సమంత 'మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాలో రెండో స్థానంలో ఉంది. పోయినేడాది నెం.1 ప్లేస్ లో నిలిచింది సామ్‌. ఇదే క్ర‌మంలో చెన్నై టైమ్స్ 'మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2020' లో టాప్ లో నిలిచి టైటిల్ గెలుచింది స‌మంత‌.  


ఇక బుట్టబొమ్మ పూజాహెగ్డే.. ఈసారి ఈ జాబితాలో మూడో స్థానానికి ఎగబాకింది. ఈమె పోయినేడాది ఐదో స్థానంలో నిలిచింది. తెలుగుతో పాటుగా హిందీ, తమిళంలో కూడా సత్తా చాటుతోంది పూజా. ఇక రకుల్ ప్రీత్ సింగ్ మోస్ట్ ఈసారి 4వ స్థానంలో నిలిచింది. గతేడాది 7వ ప్లేస్ లో ఉంది.  ఐదో స్థానంలో రష్మిక మందన్నా ఉంది. ఈమె 'బెంగుళూరు టైమ్స్ 'మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020' టైటిల్ గెలుపొందడం విశేషం.




మరింత సమాచారం తెలుసుకోండి: