బిగ్ బాస్ సీజన్ 4 రియాలిటీ షో తో సెలబ్రిటీ గా మారిన ఆరియానా గ్లోరీ గురించి అందరికీ తెలిసిందే. ఈమె బిగ్ బాస్ లో అవినాష్ తో కలిసి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఈ షోలో తన అద్భుతమైన టాలెంట్ తో తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. ఆ షోలో ముక్కుసూటిగా మాట్లాడే అమ్మాయిగా, ఇంటెలిజెంట్ గేమ్స్ తో పాటు, ఫిజికల్ గేమ్స్ లోనూ తన సత్తా చాటింది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక పలు షో లలో అవకాశం అందుకుని బిజీగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో లతో సందడి చేస్తూ ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది ఈ భామ. అంతే కాకుండా కొద్ది రోజుల క్రితం రామ్ గోపాల్ వర్మ తో చేసిన జిమ్ వీడియో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.
దీనిపై రకరకాల విమర్శలు వచ్చాయి. త్వరలో రామ్ గోపాల్ వర్మతో ఆరియానా చేయబోయే బోల్డ్ ఇంటర్వ్యూ కోసమే ప్రమోషన్స్ చేసుకుంటున్నారని అనేకమంది అన్నారు. అయితే తాజాగా ఈ బ్యూటీ గురించి ఒక వార్త హల్ చల్ చేస్తోంది. ఓ యంగ్ హీరో సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయినట్లు సమాచారం అందుతోంది. ఆరియానా ఎప్పటి నుండో హీరోయిన్ అవ్వడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమెకు అదృష్టం కలిసి వచ్చినట్టుంది. ఓ సినిమాలో హీరోయిన్ గా ఆరియానాని ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు.

 మోడ్రన్ దుస్తులతో కుర్రకారును ఆకర్షించే ఈ భామ హీరోయిన్ గా వెండితెరపై కనిపించనుందని టాక్. త్వరలో ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియనున్నాయి. బుల్లి తెర పై గ్లామరస్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వెండితెరపై కనిపించే అవకాశం దక్కించుకోవాలని కోరుకుంటున్నారు ఆమె అభిమానులు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: