మహానటి సావిత్రి మరణంతో తెలుగు ప్రేక్షకులు దుఃఖంలో ముగినిపోయారు. ఒక వ్యాంప్ ఆర్టిస్ట్‌గా, ఐటమ్ సాంగ్స్‌లతో కుర్రకారును ఉర్రూతలూగించింది సిల్క్ స్మితా. తనకుంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. సినిమాలో ఆమె ఉందని తెలిస్తే చాలు.. పండు ముసలివాళ్ల నుంచి కుర్రకారు వరకు ఎగబడి ఆ సినిమాని చూసేవారు. అప్పట్లో ఆమెకున్న క్రేజే అలాంటిది. కానీ, ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిల్క్ స్మితా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేసింది. సిల్క్ స్మితా అభిమానులు, సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా శోకసంధ్రంలో మునిగిపోయింది. సిల్క్ స్మితా ఇకలేదనే విషయాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. దీన్ని బట్టే చెప్పవచ్చు.. సిల్క్ స్మితాకు ప్రజల్లో ఉన్న ఆదరణ ఎంతో తెలుస్తుంది. 1996 సెప్టెంబర్‌లో మద్రాస్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది.

సిల్క్ స్మితా అస‌లు పేరు విజ‌య‌ల‌క్ష్మి. ఈమె ఏలూరులోని ఒక గ్రామంలో పుట్టింది. ఆమె త‌ల్లిదండ్రులు శ్రీ‌రామ‌మూర్తి, న‌ర‌స‌మ్మ‌. అయితే ఈమె ఏలూరుకు చెందిన‌ అన్న‌పూర్ణ‌మ్మ సిల్క్ స్మితాను దత్తత తీసుకుంది. స్మితాకు చిన్నప్పటి నుంచి సినిమాలపై మక్కువ ఎక్కువ. ఆ విషయాన్ని దత్తత తల్లి అన్న‌పూర్ణ‌మ్మ గుర్తించింది. చ‌క్క‌ని శ‌రీర సౌష్ట‌వం, మ‌త్తు క‌ళ్ల‌తో మ‌గాళ్ల‌ను చిత్తుచేసేట్లు ఉండే స్మితను చూసి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది. అలాగే ఆర్థికంగా సెటిల్ అవ్వచ్చని భావించింది. దీంతో సిల్క్ స్మితను సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది.

అదృష్టవశాత్తు విజయకు కూడా సినిమాల్లో నటించాలనే కోరిక ఉందని అన్నపూర్ణమ్మకు చెప్పింది. దీంతో ఇద్దరు కలిసి మద్రాస్ వెళ్లిపోయారు. మ‌ద్రాస్ చేరుకున్నాకా జూనియర్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే సిల్క్ స్మితా రూపం తమిళ దర్శకుడు విను చక్రవర్తిని ఆకర్షించింది. ఈమెకు సినిమాల్లో ఎంట్రీ ఇస్తే భవిష్యత్‌లో స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్నాయని ఆయన భావించారు. విను చక్రవర్తి భార్య కూడా ఆర్టిస్ట్ కావడంతో విజయకు నటనలో మెళకువలు నేర్పించారు. వీరిద్దరి సహకారంతో 1979లో ఇనమేటేడి అనే మలయాళ సినిమాలో నటించింది. ఈ సినిమాలో క్యాబరే డ్యాన్సర్‌ పాత్రలో తన ఒంపుసొంపులతో కుర్రకారును కళ్లు తిప్పకుండా చేసింది. ఈ సినిమా తర్వాత ఆమెకు మలయాళంలో వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: