నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా నటించిన 'ఆదిత్య 369'  సినిమా ఈ మధ్య 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బాలకృష్ణసినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. సిల్క్ స్మిత పెరిగింది అంతా తమిళనాడులోనే ఆమెకు తెలుగు అంతగా రాదు. ఈ సినిమా వరకు స్మిత ఐటం సాంగ్ లు చేస్తూ ఉండేది. మరియు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న వేషాలు మాత్రమే వేసేది అని 'ఆదిత్య 369' లో రాజ నర్తకి పాత్రలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ లో కనిపించింది అని. ఆ క్యారెక్టర్ ఒక ఆవేశపూరితమైన డైలాగ్స్ చెప్పే సన్నివేశం సినిమాలో ఉంది దానికోసం ఒక డైలాగ్ ను కూడా రాశారు. దానిని సిల్క్ స్మిత కి ఇచ్చారు. ఆ డైలాగ్ ఓనిఛా నికృష్ణుడా అని మొదలవుతుంది. సిల్క్ స్మిత కూడా ఓనిఛా నికృష్ణుడా అని మొదలుపెట్టి  ఇంగ్లీష్ లో ముగించింది.


 డైలాగ్ పూర్తయిన వెంటనే ఆవేశంగా ఓకేనా డైరెక్టర్ అని అడిగింది. వెంటనే దర్శకుడు నువ్వు ఇంగ్లీషులో చెప్పావు అమ్మా అంటూ అన్నాడు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళం అంతా నవ్వాం. మరియు ఈ సందర్భంలోనే బాలకృష్ణ సిల్క్ స్మిత ఫేస్ లో ఒరిజినల్ టేన్ ఉంటుంది అని. ఇక ఆవిడ మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ విషయంలో ఆవిడ్ని కొట్టే ఆడది లేదు. ఆడది అని ఎందుకు అన్నానంటే, పెద్ద హీరోయిన్స్ కూడా ఆమెను ఫాలో అయ్యేవారు. శ్రీదేవి లాంటి గొప్ప నటి కూడా సిల్క్ స్మిత ను ఇమిటేట్ చేసేది. సిల్క్ స్మిత ఎలాంటి దుస్తులు ధరించే లేదా అని చాలామంది హీరోయిన్లు గమనించేవారు. సాధారణ డాన్సర్ ని స్టార్ హీరోయిన్లు ఇమిటేట్ చేయడం అన్నది ఇది మామూలు విషయం కాదు అని చాలా విషయాలలో సిల్క్ స్మిత ను కొట్టేవారే లేరు అంటూ బాలకృష్ణ ప్రశంసల వర్షం కురిపించాడు.మరియు సినిమా గురించి కూడా అనేక విషయాలు చర్చించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: