1970 - 80 వ దశకంలో తెలుగు సినిమా రంగాన్ని ఎంతో మంది స్టార్ హీరోయిన్లు ఏలేరు. ఊర్వశి శారద - వాణిశ్రీ - జయప్రద - జయసుధ - శ్రీదేవి - విజ‌య నిర్మ‌ల‌ అలా ఆ తరంలో వీరందరూ హీరోలతో పోటీపడి మరీ నటించేవారు. ఈ హీరోయిన్ల పక్కన నటించాలంటే స్టార్ హీరోలకు సైతం ఒక్కోసారి చెమటలు పట్టే వి. ఈ హీరోయిన్లు సినిమాల్లో నటించారు అనేకంటే జీవించారు అని చెప్పాలి. అలాంటి గొప్ప నటీమణుల్లో వాణిశ్రీ ఒకరు. వాణిశ్రీ స్వయంకృషితో టాప్ హీరోయిన్ రేంజికి ఎదిగారు. ఈ క్రమంలోనే ఆమె సూపర్ స్టార్ కృష్ణ తో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. వాణి శ్రీ - కృష్ణ కాంబినేషన్ అంటే చాలా రొమాంటిక్ కాంబినేషన్ అన్న పేరు ఉండేది.

అయితే ఆ సమయంలో కృష్ణ - విజయనిర్మల తో కూడా ఎక్కువగా సినిమాలు చేశారు. కృష్ణ - విజ‌య నిర్మ‌ల‌ ఎక్కువ సినిమాలు చేస్తున్న సమయంలోనే వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా చిగురించి వారు పెళ్లి చేసుకునే వరకు వెళ్ళింది. ఆ సమయంలో వాణిశ్రీకి , విజ‌య నిర్మ‌ల‌కు మధ్య వృత్తిపరమైన పోటీ ఎక్కువగా ఉండేది. వీరిద్దరూ ఎవరికి వారే తమ అభినయంతో ప్రేక్షకుల మనసు గెలిచిన వారు. చివరకు వాణిశ్రీ - విజయనిర్మల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఏ స్థాయికి చేరిందంటే విజయనిర్మల కృష్ణ పై ఒత్తిడి తెచ్చి మరి వాణిశ్రీ తో నటించవద్దని కండిషన్ పెట్టేవరకు వెళ్లిందట.

విజయనిర్మల ఒత్తిడి చేయడంతో కృష్ణ కొన్నేళ్లపాటు వాణిశ్రీ తో సినిమాలు చేయలేదు. ఇద్దరు స్టార్ హీరోయిన్ల మధ్య వృత్తిపరమైన పోటీలో ఏర్పడిన గ్యాప్ కాస్త చివరకు విజయ నిర్మల ... కృష్ణ‌పై ఒత్తిడి చేసి మ‌రీ వాణి శ్రీ ప‌క్క‌న న‌టిస్తే ఊరుకునేది లేద‌ని కండీష‌న్ పెట్టే వ‌ర‌కు వెళ్లింది. ఆ త‌ర్వాత చాలా రోజుల పాటు వీరి మ‌ధ్య మాటలు లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: