టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఫస్ట్ టైం హీరోగా తెలుగు తెరకు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో పరిచయం అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తొలి సినిమాతో మంచి పేరు అందుకున్న పవన్, ఆ తరువాత గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలు చేసి తద్వారా కూడా మంచి విజయాలు అందుకున్నారు. ఇక తన నాలుగవ సినిమా తీసే ఛాన్స్ యువ దర్శకుడు కరుణాకరన్ కి ఇచ్చారు పవన్. ఆ విధంగా జివిజి రాజు నిర్మాతగా పవన్, కీర్తి రెడ్డి ల కలయికలో కరుణాకరన్ తీసిన సినిమా తొలిప్రేమ.
అప్పట్లో మంచి క్రేజ్ తో రిలీజ్ అయిన ఈ సినిమా విడుదల అనంతరం యువత, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని పెద్ద విజయం సొంతం చేసుకుంది. అప్పటికి పవన్ కళ్యాణ్ కెరీర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన తొలిప్రేమ సినిమాలో నగేష్, నర్రా వెంకటేశ్వర రావు, సంగీత, అలీ, వేణుమాధవ్, వాసుకి తదితరులు ఇతర పత్రాలు చేశారు. మంచి లవ్ కమ్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో స్క్రీన్ పై పవన్, కీర్తి రెడ్డి జోడీ అదరగొట్టడంతో పాటు పలు లవ్ సీన్స్ యువత మనసుని ఎంతో ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా సినిమాకి దేవా అందించిన సాంగ్స్ పెద్ద ఆకర్షణ అనే చెప్పాలి. తొలిచూపులోనే స్వప్న ని చూసిన బాలు ఆమె ప్రేమలో పడడం, ఆ తరువాత ఆమెతో స్నేహం చేసి, ఆపై చివరికి ఆమె ప్రేమని ఏ విధంగా పొందాడు అనే కాన్సెప్ట్ తో అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించే విధంగా దర్శకుడు కరుణాకరన్మూవీ ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ఈ మూవీ తరువాత తమ్ముడు, బద్రి, ఖుషి ఇలా మరింతగా బ్లాక్ బస్టర్స్ తో ముందు దూసుకెళ్లారు పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: