బాలకృష్ణ తన సినిమాల ద్వారా కొంతమంది హీరోయిన్ లను తెలుగు తెరకు పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇక అంతే కాదు ఈయనతో ఎంతోమంది ఈయన కంటే తక్కువ వయసు ఉన్న హీరోయిన్లు కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రాక , వేరొక భాష సినీ ఇండస్ట్రీలో కొంత మంది దూసుకుపోతుంటే, ఇంకొంత మంది సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక అలాంటి వారిలో ఒక్క మగాడు సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన హాట్ బ్యూటీ నిషా కొఠారి కూడా ఒకరు..ఈమె తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకి నిద్రలేకుండా చేసింది.

ఈమెను ప్రియాంక కొఠారి అని కూడా పిలుస్తుంటారు. ప్రస్తుతం ఈమె సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఒక మోడల్ గా పనిచేసి , ఆ తర్వాత హీరోయిన్ గా అడుగుపెట్టింది. 1983 నవంబర్ 30 వ తేదీన కోల్ కత్తా లో జన్మించిన ఈమె, బెంగాలీ, రాజస్థాని, హిందీ, ఇంగ్లీష్ భాషలను కూడా చక్కగా మాట్లాడగలదు. ఇక పదవ తరగతి చదువుతున్నప్పుడే న్యూ ఢిల్లీ కి వెళ్లి ఆ తర్వాత దయాల్ సింగ్ కళాశాలలో కెమిస్ట్రీలో డిగ్రీ పట్టా అందుకుంది.
ఇక ఈమె తండ్రి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కాగా తల్లి ఇంట్లోనే హోం మేకర్ గా ఉంటుంది. అక్క కూడా ఉంది. ఆమె పెళ్లి అయి సెటిల్ అయినట్లు సమాచారం. చదువు పూర్తి చేసుకున్న నిషా కొఠారి మోడల్ గా పనిచేస్తూ ప్రకటనలకు నటించింది. మొదటిసారి ఈమె తమిళ చిత్రం అయిన జేజే ద్వారా సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. అయితే ఈమెను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది మాత్రం ప్రముఖ నటుడు మాధవన్. చివరిసారిగా నటించి బాలీవుడ్ లోకి ప్రవేశం చేసింది. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన జేమ్స్ అండ్ సర్కార్ అనే సినిమాలో నటించింది.. ఈమె ఎక్కువగా ఐటమ్ సాంగులకు పెట్టింది పేరు. బాలీవుడ్ లో సెక్సీ గర్ల్ గా గుర్తింపు పొందింది నిషా కొఠారి.. ఇక ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ అని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: