చలన చిత్ర పరిశ్రమలో మొదటి మూలస్తంభం ఏఎన్నార్ అని చెప్పవచ్చు.. మన సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి చివరి శ్వాస వరకు తన జీవితాన్ని సినీ ఇండస్ట్రీకే పరిమితం చేసిన మహా గొప్ప నటుడు.. ప్రేమకథా చిత్రమ్ అయినా పౌరాణిక చిత్రమైన ఎందులోనైనా జీవించి నటించే నటుడు. ప్రముఖ చిత్రనిర్మాత ఘంటసాల బలరామయ్య విజయవాడ రైల్వే స్టేషన్ లో ఏఎన్ఆర్ ని కనుక చూసి ఉండక పోయి ఉంటే ఈరోజు సినీ ఇండస్ట్రీ ఒక గొప్ప నటుడిని కోల్పోయి ఉండేది.


ధర్మపత్ని సినిమాతో తన సినీ జీవితాన్ని మొదలు పెట్టాడు ఏఎన్ఆర్..ఇక  నాగేశ్వరరావు 1949 ఫిబ్రవరి 18వ తేదీన అన్నపూర్ణను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రముఖ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన జమున ఏఎన్ఆర్ గురించి కొన్ని సంచలన విషయాలు తెలిపింది.. కేవలం నాగేశ్వరరావు వల్లే ఆమెను సినీ ఇండస్ట్రీ నుంచి వెలి వేశారు అని చెప్పింది.


ప్రేక్షకుల మదిలో ప్రత్యేకస్థానాన్ని నిలుపుకున్న గొప్ప హీరోయిన్ గా జమున నిలిచింది. తెలుగు జాతి గర్వించదగ్గ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో కలిసి వారితో సమానంగా దాదాపు 195 సినిమాలలో నటించిన ఘనత జమునది. ఇక జమునకు ప్రాణ స్నేహితురాలు మహానటి సావిత్రి. వీరిద్దరి స్నేహం సినీ ఇండస్ట్రీలో విడదీయరాని బంధంగా ఉండేది. అయితే మొన్నామధ్య ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఏఎన్నార్ ఇద్దరూ కలిసి నన్ను సినీ ఇండస్ట్రీ నుంచి వెలి వేయాలని చూశారు. ఎందుకని కారణం అడిగినప్పుడు సమయానికి రాదు.. కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది.. చాలా భిన్నత్వమైన  మనసు కలిగినదని ఈమెకు బుద్ధి చెప్పాలంటే , ఎన్టీఆర్ ఏఎన్నార్ ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. అని ఆమె చెప్పింది.


అయితే ఒక సినిమా షూటింగ్ సమయంలో కారులో జమున, ఏఎన్ఆర్ కలసి ఒక సన్నివేశం షూట్ చేయాల్సి ఉంది. ఆదుర్తి సుబ్బారావు డైరెక్ట్ చేస్తున్నాడు. ఏఎన్నార్, జమున పైన చేయి వేయడంతో ఆమె గట్టిగా అరచి గందరగోళం చేసిందట. ఇక ఇది నచ్చని ఏఎన్ఆర్ వెంటనే ఎన్టీఆర్ కు ఫోన్ చేయడం , కలవడం జమున తనను గోరంగా అవమానించింది అంటూ వెంటనే ఇద్దరూ కలుసుకుని సినీ ఇండస్ట్రీలోని దర్శకులను కలిసి జమునతో నటించమని చెప్పారట. అలా  వీరిద్దరి నిర్ణయం వల్లే ఆమెను సినీ ఇండస్ట్రీ నుంచి వెలి వేశారని తెలిపింది జమున.


మరింత సమాచారం తెలుసుకోండి:

ANR