టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫామ్ లో లేని దర్శకులలో మెహర్ రమేష్ ఒకరు.శక్తి, షాడో లాంటి భారీ డిజాస్టర్స్ తర్వాత కొన్నాళ్ల పాటూ సినిమాలకే దూరమయ్యాడు ఈ దర్శకుడు.మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నాడు.చిరంజీవితో సినిమా అనౌన్స్ చేసినప్పుడు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు.అనౌన్స్ అయితే చేశారు సరే.. అసలు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందా అని అందరూ అనుమానంగా చూసారు.కానీ ఇటీవల మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి టైటిల్ పోస్టర్ నిరిలీజ్ చేశాడు మెహర్ రమేష్.

తమిళంతో అజిత్ నటించిన 'వేదాలం' సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కి 'భోళాశంకర్' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.ఇక ఈ సినిమాలో మెగాస్టార్ కి చెల్లిగా స్టార్ హీరోయిన్ కీర్తీ సురేష్ కనిపించనుంది.ఇటీవల రాఖీ పండగ సందర్భంగా చిరంజీవి తో కీర్తీ సురేష్ ఉన్న ఓ పోస్టర్ ని కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇక ఇదిలా ఉంటె ఈ సినిమాకి డైరెక్టర్ మెహర్ రమేష్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే విషయం ఇప్పుడు ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ గా మారింది.ఇక అందుతున్న సమాచారం ప్రకారం..ఈ సినిమాకి మెహర్ రమేష్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట.నెలవారీ జీతం, అలాగే లాభాల్లో వాటాని తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాడట.

సినిమా ప్రీ ప్రొడక్షన్ దశ నుండి నెలకు 5 లక్షల రూపాయల చొప్పున మెహర్ రమేష్ కి జీతం ఇస్తున్నారట.ఇక సినిమా విడుదల తర్వాత లాభాల్లో 20 శాతం వాటా కూడా ఇచ్చేలా కాంట్రాక్ట్ కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది.అంటే సినిమా బాగా తీసి..హిట్ కొట్టాల్సిన బాధ్యత ఇప్పుడు మెహర్ రమేష్ పై పడింది.ఈ సినిమా మంచి విజయం సాధిస్తే తప్ప మెహర్ రమేష్ కి లాభాల్లో వాటా అనేది దక్కదు.ఆఅందుకే ఎలాగైనా ఈ సినిమాతో విజయం సాధించాలనే కసితో ఉన్నాడు మెహర్ రమేష్. ఇక ఈ రీమేక్ కి పలు మార్పులు చేర్పులు కూడా చేసాడని అంటున్నారు. మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఈ సినిమా స్క్రిప్ట్ ని పక్కాగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: