ఇంతకీ అదేంటంటే..!! ముంబైకి సంబంధించినటువంటి సెలబ్రెటీ మేనేజ్మెంట్ కంపెనీలో చేరి పదికోట్ల కోసం ఓ ఏడాది పాటు ఆ కంపెనీ లో ఉండాలని డీల్ ను కుదుర్చుకుందట. దాంతో మెల్లగా ఓ సంవత్సరం పాటు ఇండస్ట్రీతో పెద్దగా టచ్ లో లేకపోవడంతో అవకాశాలు తగ్గాయని అని చెబుతుంటారు. స్టార్ హీరోయిన్ గా సుదీర్ఘ కాలం రాణించే అందం, ప్రతిభ ఉన్న ఆసిన్ కేవలం పదికోట్ల కోసం కెరియర్ నాశనం చేసుకుందని చాలా వార్తలే వినిపించాయి. అనంతరం 2016 లో రాహుల్ శర్మ అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు బాయ్ బాయ్ చెప్పేసింది ఈ అందాల తార.
రాహుల్ మైక్రోమ్యాక్స్ సంస్థకు కో ఓనర్ గా ఉన్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. సినిమాలకు దూరమైన ఆసిన్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ చాలా సార్లు వార్తలు వినిపించినా అవేమీ జరగలేదు. సోషల్ మీడియా వేదిక ద్వారా ఎపుడు ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటారు ఆసిన్. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ తెలియచేస్తున్నారు ఫ్యాన్స్ మరియు పలువురు సినీ ప్రముఖులు.