ఈ మధ్య కాలంలో హీరోయిన్లు తమ లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల వయసు మీద పడుతున్న అప్పటికీ చాలా అందంగా.. యవ్వనంగా కనిపిస్తూ ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.. ఇంకా బాగా చెప్పాలి అంటే నాలుగు పదుల వయసులో కూడా సంతూర్ మమ్మీ అనిపించుకుంటున్నారు ఈ ముద్దుగుమ్మలు.. ఇక వారు తీసుకొనే ఆహారపు అలవాట్లు కానివ్వండి.. చేసే యోగ భంగిమలు కానివ్వండి.. ఏది ఏమైనా సరే వారు మాత్రం తమ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇక్కడ ఒక భామ వయసు తెలిస్తే 47 యేళ్లు కానీ చూస్తే 20 యేళ్ళ అమ్మాయిలా కనిపిస్తోంది.. ఆమె ఎవరో కాదు బోల్డ్ బ్యూటీ గా గుర్తింపు తెచ్చుకున్న మలైకా అరోరా.. ఈ కొత్త సంవత్సరం తనలాగా మరెంతో మంది అమ్మాయిలు తయారవ్వాలని తన ఫిట్నెస్ సీక్రెట్స్ చెబుతూ కుర్రకారును కూడా ఆకట్టుకుంటోంది.

మలైకా అరోరా.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అని చెప్పవచ్చు. ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిథి సినిమాలో మొదటిసారి తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక అనే పాట ద్వారా ప్రేక్షకులను మరోసారి పలకరించింది. ఇక అసలు విషయం ఏమిటంటే బాలీవుడ్ సినీ పరిశ్రమలో నెంబర్ వన్ ఐటం గర్ల్ గా సత్తా చాటుతోంది ఈ ముద్దుగుమ్మ.. అందం, అభినయం విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవకుండా యవ్వనంగా కనిపించడంలో అసలు తగ్గకుండా తనదైన శైలిలో చూపరులను ఆకట్టుకుంటోంది.

అంతేకాదు ఈమె శరీరాన్ని స్ప్రింగులా వంచుతూ.. ఈమె చేసే యోగ భంగిమలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.. అంతేకాదు మలైకా చేస్తున్న యోగా భంగిమలు చూస్తే నిజంగా 47 లేక 27 అనే అనుమానం కలుగుతోంది. తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె యోగా భంగిమలు చూసి అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.. ఇకపోతే బ్రీత్ టేకింగ్ హాట్ నెస్  తో  చుక్కలు చూపిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫోటోలను మీరు కూడా ఒకసారి చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: