మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఫిబ్రవరి 3వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్నగా కరోనా ఉన్న కారణంగా పలుమార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడి చివరకు ఫిబ్రవరి 3వ తేదీన విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఈ సినిమాకు కరోనా ప్రభావం పడనుంది. దేశంలో కేసులు విపరీతంగా పెరిగి పోతుండటంతో రాష్ట్రంలో ఆంక్షలు విధించే విధంగా ప్రభుత్వం చర్యలు కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉండటంతో మళ్ళీ సినిమా పోస్ట్ పోన్ అవ్వక తప్పదు అనే అనుమానాలను రేకెత్తిస్తుంది.

రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో మెగాస్టార్ జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా రామ్ చరణ్ జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. ఇక టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఆయన మొదటి నుంచి తన సినిమాలను మంచి కథతో పాటు సోషల్ మెసేజ్ కూడా ఉండేలా చూసుకుంటాడు. అందుకే ఆయన సినిమాలకు అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి ఘనవిజయాన్ని అందిస్తు ఉంటారు. ఆ విధంగానే ఈ చిత్రాన్ని కూడా మంచి సోషల్ మెసేజ్ తో తెరకెక్కించిన కొరటాల శివ ఇప్పుడు కొన్ని కాపీ విమర్శలు ఎదుర్కోవడం ఆయన అభిమానులను తీవ్రమైన నిరాశకు గురిచేస్తుంది.

సినిమా ఒక పుస్తకం ఆధారంగా తెరకెక్కింది అని మొదటి నుంచి వస్తున్న విమర్శలు. అయితే దీనిని కొరటాల ఒప్పుకోకపోవడం, ఏమాత్రం కూడా స్పందించకపోవడం ఇది నిజం అని చెప్పడానికి ఎక్కువగా కారణాలు అవుతున్నాయి. తొందరగా కొరటాల శివ దీనిపై స్పష్టత ఇస్తే బాగుంటుంది అనేది ఆయన అభిమానుల మాట. ఇక విడుదల దగ్గరవుతున్న కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఏ మాత్రం మొదలు పెట్టక పోవడం చూస్తుంటే ఫిబ్రవరి 3న ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అన్న అనుమానాలను కలుగజేస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమాను విడుదల చేయడం కంటే పోస్ట్ పోన్ చేయడం మేలు అని మెగా అభిమానులు సూచిస్తున్నారు. మరి చిత్రబృందం దీని పట్ల ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: