పవన్ కళ్యాణ్ హీరోగా.. రానా మరో హీరోగా కలిసి మల్టీస్టారర్ మూవీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.. అదే భీమ్లా నాయక్.. ఈ సినిమా పై ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి పెంచుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ లు, పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి. ఇకపోతే ఈ సినిమాలో లా లా భీమ్లా అనే పాటను పాడిన మొగలయ్య గురించి అందరికీ తెలిసిందే.. కిన్నెర రాగానికి ప్రాణం పోసిన కిన్నెర మొగులయ్య ను పద్మశ్రీ వరించడంతో ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు..

73 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం విశేషమైన ప్రతిభ చాటిన ఎంతో మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది.. ఈ నేపథ్యంలోనే అరుదైన తెలంగాణకు చెందిన కళను బతికిస్తూ దర్శనం ఇస్తున్న కిన్నెర మొగులయ్య పేరు కూడా ఈ పద్మశ్రీ అవార్డుల లిస్టులో ఉండడం గమనార్హం.. వైవిధ్యమైన ప్రాచీన కళ అయినటువంటి 12 మెట్ల కిన్నెర పలికించే రాగానికి పులకించిన పద్మశ్రీ నేడు మొగలయ్యను వరించడంతో  అందరికీ సంతోషంగా ఉంది..

మొన్నటి వరకు ఈయన ఎవరో కూడా చాలామందికి తెలియదు.. పవన్ కళ్యాణ్ మనలో ఉన్న ప్రతిభను గుర్తించి.. తన సినిమాలో పాటలు పాడించి.. అందరికీ ఆయన గురించి తెలిసేలా చేశారు. ఇక అలా  కేంద్రం దృష్టిలో కూడా  కిన్నెర మొగలయ్య స్థానం సంపాదించుకోవడం గమనార్హం. ఇకపోతే నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన ఈ మొగులయ్య 12 మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆఖరి తరం కళాకారుడు కావడం బాధాకరం అనే చెప్పాలి..


ఈయన తర్వాత ఈ కళను ప్రదర్శించేవారు ఇక లేరేమో అని చాలామంది కళ ను  ప్రోత్సహించేవారు బాధపడుతున్నారు.. ఇక ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం కళాకారులను గుర్తించి వారికి పద్మశ్రీ పురస్కారం  అందించడం దేశవ్యాప్తంగా గర్వించదగ్గ విషయమని అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: